E-Paper
Advertisement

పప్పుచారులో నంజుకోవడానికి బాప్‌లాంటి ‘కరివేపాకు రొయ్యల వేపుడు’.. తింటే ఫిదా అయిపోతారు!

పప్పుచారులో నంజుకోవడానికి బాప్‌లాంటి ‘కరివేపాకు రొయ్యల వేపుడు’.. తింటే ఫిదా అయిపోతారు!
Advertisement

Karivepaku Royyala Vepudu: రొయ్యల కూరలు, వేపుళ్లు అంటే పడిచచ్చే మాంసాహార ప్రియులకు ఈ వంటకం ఒక వరమనే చెప్పాలి. సాధారణంగా చేసే రొయ్యల వేపుడు కంటే కరివేపాకు సువాసనలతో చేసే ఈ వేపుడు రుచి అసలు వర్ణించలేం. ఘుమఘుమలాడే కరివేపాకు, ఘాటైన మసాలాలు రొయ్యలకు పట్టి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. వేడివేడి అన్నంలోకి లేదా పప్పుచారు, రసంతో నంజుకుని తింటే ఆ తృప్తే వేరు. చుట్టాలు లేదా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏదైనా చేసి పెట్టాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. దీనిని తయారు చేయడం కూడా చాలా సులువు. ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి..

కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు – అర కేజీ
కరివేపాకు – రెండు కప్పులు
నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – నాలుగు (నిలువుగా కోసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
పసుపు – అర టీస్పూన్
కారం – రెండు టీస్పూన్లు
ధనియాల పొడి – ఒక టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
యాలకులు – రెండు
లవంగాలు – నాలుగు
దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క
మిరియాల పొడి – అర టీస్పూన్
నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం ఇలా:

Advertisement

మొదట రొయ్యలను శుభ్రంగా కడిగి పసుపు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి కరివేపాకును దోరగా వేయించి చల్లారాక పొడిలా లేదా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక దాచిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేగనివ్వాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పట్టీ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.

Advertisement

తర్వాత మసాలా పట్టిన రొయ్యలను బాణలిలో వేసి కలపాలి. రొయ్యల నుండి నీరు ఊరి దగ్గరకు పడేవరకు మంటను మిడియం మీద ఉంచి ఉడకనివ్వాలి. నీరంతా ఇంకిపోయాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

రొయ్యలు వేగుతున్నప్పుడు ముందుగా వేయించి పొడి చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. సన్నని మంటపై మరొక ఐదు నిమిషాలు వేగనిస్తే కరివేపాకు ఘుమఘుమలు రొయ్యలకు బాగా పడతాయి. చివరిగా గరం మసాలా చల్లుకుని బాగా కలిపి దించేస్తే నోరూరించే కరివేపాకు రొయ్యల వేపుడు సిద్ధమవుతుంది.

 

Tags

Related News

పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేేస్తే అస్సలు వదలరు!

పర్ఫెక్ట్ కొలతలతో గుమగుమలాడే సెమియా కేసరి..క్షణాల్లోనే రెడీ అవుతుంది

పర్ఫెక్ట్ కొలతలతో..నోరూరించే బ్రెడ్ హల్వా రెసిపీ

రాయలసీమ స్టైల్ నాటుకోడి వెల్లుల్లి కారం.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

బోటీ కూర అంటే ఇష్టముండదా? చింతచిగురుతో ఇలా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!

రైస్ వాటర్‌తో మెరిసే జుట్టు, గ్లాస్ స్కిన్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?

మధ్యాహ్నం కాగానే కళ్లు మూతలు పడుతున్నాయా? శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్ ఇది!

Big Stories

Advertisement
×