E-Paper
Advertisement

మీరు రోజు అదే టైంకి భోజనం చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్!

మీరు రోజు అదే టైంకి భోజనం చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్!
Advertisement

Meal Timing: రోజూ మనం ఏ టైమ్‌కి తింటున్నాం అనే విషయాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఓ కొత్త స్టడీ మాత్రం భోజనం టైమింగ్‌పై షాకింగ్ విషయాలు వెల్లడించింది. 31,044 మంది పెద్ద వారిపై ఈ పరిశోధన జరిగింది. వీళ్లంతా 40 ఏళ్లు పైబడినవాళ్లు. ఇందులో ముఖ్యంగా మొదటి భోజనం ఎప్పుడు చేస్తున్నారు? చివరిగా ఎప్పుడు తింటున్నారు? అనే అంశాలను పరిశీలించారు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తినే వారితో పోలిస్తే 8 నుంచి 10 మధ్య తినే వారిలో మరణాల రిస్క్‌ 10 శాతం ఎక్కువగా కనిపించిందని తెలిపింది. 10 గంటల నుంచి 12 గంటల మధ్య తినేవారిలో 19 శాతం.. మధ్యాహ్నం 12 తర్వాతే తిన్న వారిలో మరణాలు 29 శాతం ఎక్కువగా కనిపించిందట.

అర్ధరాత్రి తర్వాత భోజనం..

ఇక రాత్రి విషయానికొస్తే రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య తిన్న వారితో పోలిస్తే అర్ధరాత్రి తర్వాత భోజనం చేసినవారిలో రిస్క్‌ 27 శాతం ఎక్కువగా కనిపించింది. అంతేకాదు. గుండె సంబంధిత మరణాల్లోనూ ఇలాంటి సంబంధం కనిపించిందని సర్వే చెప్పింది. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. లేట్‌గా తింటే ఆయుష్షు తగ్గిపోతుంది అని ఈ స్టడీ చెప్పడం లేదు. ఇది observational study. అంటే లేట్‌గా తినేవారిలో ఈ రిస్క్‌ ఎక్కువగా కనిపించిందని మాత్రమే చెబుతోంది. వాళ్ల జీవనశైలి ఆరోగ్య పరిస్థితులు నిద్ర ఆహారపు అలవాట్లు లాంటి ఇతర అంశాలు కూడా ప్రభావం చూపి ఉండొచ్చు.

రెగ్యులర్‌ మీల్‌..

Advertisement

నిపుణుల ప్రకారం అందరూ తప్పనిసరిగా ఒకే టైమ్‌కి తినాలనే రూల్‌ లేదు. కానీ వీలైనంత వరకు రెగ్యులర్‌ మీల్‌ టైమింగ్స్‌ పాటించడం రాత్రి చాలా ఆలస్యంగా హెవీ మీల్స్‌ తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు.

Also read: డీలిమిటేషన్‌ అంశం పై.. స్టాలిన్ తేల్చిచెప్పిన మాటలివే..?

Tags

Related News

గీజర్ ఆటో-కట్ అవుతుందని వదిలేస్తున్నారా? ఆ ఒక్క పార్ట్ పాడైతే ఇంట్లో బాంబు పేలినట్టే!

పావుగంటలో రెడీ అయ్యే ఇన్‌స్టంట్ బ్రెడ్ గులాబ్ జామూన్.. టేస్ట్ చాలా బాగుంటుంది!

ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ వేపుడు.. ఈ మసాలా పొడి వేసి చేస్తే అన్నం మొత్తం దీనితోనే తినేస్తారు!

పాతకాలం నాటి కమ్మని కొబ్బరి బూరెలు.. ఈ సీక్రెట్ టిప్ పాటిస్తే మొదటిసారే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి!

అల్యూమినియం ఫాయిల్‌కు రంధ్రాలు పెడితే ఇన్ని ఉపయోగాలా? వంటింట్లో సగం పనులు ఈజీ అయిపోతాయి!

ఉదయాన్నే కొబ్బరి నీళ్లలో ఈ 6 సూపర్ ఫుడ్స్ కలిపి తాగితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ, డబుల్ హైడ్రేషన్!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్..ఇలా చేయండి!

Big Stories

Advertisement
×