BigTV English

Chenpi speciality: తొక్క తింటారు, పండు పడేస్తారు.. చైనీస్ స్పెషాలిటీ

Chenpi speciality: తొక్క తింటారు, పండు పడేస్తారు.. చైనీస్ స్పెషాలిటీ

నారింజ కాయ ఇస్తే ఎవరైనా ఏం చేస్తారు..? తొక్కతీసి తొనలు తింటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇంతే. కానీ చైనీస్ మాత్రం కాస్త వెరైటీ అక్కడ తొక్క తింటారు, తోలు పడేస్తారు. దానికి ఓ కారణం కూడా ఉంది. ఇంతకీ చైనాలో నారింజ కాయల్ని అంత వెరైటీగా ఎందుకు తింటారు..? మీరే చదవండి.


2వేల టన్నుల ఆరెంజ్ పండ్లు..
చైనా పేరు చెబితే మనందరికీ గుర్తొచ్చేది డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని ఇప్పుడు మనం కూడా ఇష్టంగానే తింటున్నాం. మన దేశంలో దొరికే ఆరెంజ్ ని కూడా చైనీయులు ఇష్టంగానే తింటారు. అయితే వారు ఆరెంజ్ తొక్క తీసి లోపలి పండుని తినరు. తొక్కలు తీసి జాగ్రత్తగా దాచుకుంటారు, లోపలి పండుని మాత్రం పడేస్తారు. అలా చైనీయులు ప్రతి ఏడాది 2 వేల టన్నుల నారింజ పళ్లను చెత్తకుప్పలో పడేస్తారు.

తొక్కని తింటారు సరే, మరి పండుని ఎందుకు చెత్తకుప్పలో పడేస్తారంటే దానికి వారిచ్చే సమాధానం మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. నారింజలోని పులుపుని చైనీయులు ఇష్టపడరు. పైగా అందులో విత్తనాలుంటాయి. ఆ విత్తనాలు తీయడం, పోనీ నారింజ పండు తినేటప్పుడు విత్తనాలను ఊసేయడం వారికి ఇష్టం ఉండదు. అదో కష్టమైన ప్రక్రియగా వారు భావిస్తారు. అందుకే తొక్క తీసిన తర్వాత వచ్చే నారింజ పండ్లను చెత్తకుప్పల్లో పడేస్తారు.


తొక్కని ఏం చేస్తారు..?
నారింజ పండ్ల ఫలసాయం చైనాలో ఎక్కువే. వేల టన్నుల నారింజ పండ్లు అక్కడ లభిస్తాయి. పక్వానికి వచ్చిన తర్వాత వాటన్నిటినీ సేకరించి శుభ్రంచేస్తారు. చల్లని నీళ్లతో కడిగి తొక్కతీసే యంత్రాల కింద పెట్టి పండుని వేరు చేస్తారు. తొక్కని వేరుచేసి భద్రపరుస్తారు, పండుని మాత్రం చెత్తబుట్టలో వేస్తారు. వేరు చేసిన తొక్కని ఎండబెడతారు. ఆ తొక్క ఎంత బాగా ఎండితే దానికి అంత రేటు పలుకుతుంది. బాగా ఎండిన తర్వాత తొక్కని ప్యాక్ చేసి అమ్ముతారు.

?utm_source=ig_web_copy_link

తొక్కతో పనేంటి..?
తొక్కే కదా అని తీసిపారేయకండి అంటారు చైనీయులు. ఆ తొక్కతోనే వారికి పనంతా. నారింజ పండ్ల తొక్కని చైనాలో చెన్పి అంటారు. చెన్పి అని పిలిచే ఆ తొక్కల్ని చైనీయులు అపురూపంగా చూసుకుంటారు. ఆరోగ్యానికి అదే అద్భుత ఔషధం అని చెబుతారు.

యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్..
చైనా, జపాన్ దేశాల్లో చాలామంది వయసుమళ్లిన వారు కూడా ఆరోగ్యంగా కనపడతారు. అంటే యుక్తవయసునుంచి వారు అలాంటి ఆహారపు అలవాట్లను చేసుకుంటారు. ఎక్కువకాలం దృఢంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. చెన్పిని కూడా ఇలాంటి యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ గా చెబుతారు. 90 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా కనపడాలంటే చెన్పి తప్పనిసరి. ఇక టీ, కాఫీలు కూడా చెన్పితోనే తయారు చేస్తుంటారు. మనం లెమన్ టీ, అల్లంటీ ఎలా తాగుతామో, చేనీయులు చెన్పి టీ తాగుతారనమాట. అంటే ఎండిన నారింజ తొక్కల్ని మరిగే నీటిలో నానబెట్టి ఆ రసాన్ని టీలో కలుపుకొని తాగుతారు. ఈ చెన్పి టీ తాగితే శ్వాస కోశ సమస్యలు తగ్గిపోతాయనేది వారి నమ్మకం. అంతే కాదు జీర్ణ వ్యవస్థను కూడా ఈ చిన్పి సరిదిద్దుతుందట. అందుకే చైనీయులకు నారింజ పండ్ల కంటే తొక్కలంటేనే ఎక్కువ ఇష్టం. పండ్లను పడేస్తారు, తొక్కలు తినేస్తారు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×