TG Govt Plan: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ప్రయార్టీ అంతా ఇంతా కాదు. దీనిపై అవగాహన ఉంటే ఉద్యోగాలు కోకొల్లలు. టెక్ యుగంలో దీన్ని రెవల్యూషన్‌గా భావిస్తున్నారు. అందుకే దేశంలోని చాలా రాష్ట్రాలు ఏఐ ఆధారిత యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్లలో ఐఏ పాఠాలను తీసుకురావాలని భావిస్తోంది. తెర వెనుక పనులు జరుగుతున్నాయి.
దశాబ్దం లేదా రెండు దశాబ్దాలు ఏఐ హవా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అడ్ డేట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కూడా. యాప్స్ మాదిరిగా యువతను ఆకట్టుకుంటోంది. ఏఐపై కాస్త నాలెడ్జ్ ఉంటే ఉద్యోగాలు సునాయాశంగా సంపాదిస్తున్నారు.
ప్రైమరీ స్కూళ్లకు ఏఐ పాఠాలు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐను పరిచయం చేస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో 1 నుంచి 5 తరగతుల వరకు పాఠాలను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ఏఐ గురించి చిన్నారులకు తెలుస్తుంది. తొలుత కంప్యూటర్ పరిచయంతో మొదలవుతుంది. కంప్యూటర్ విద్యను అన్ని పాఠశాలలో ఉంటే ఏఐ గురించి తెలుసుకోవడం విద్యార్థులకు ఈజీ అవుతుంది. దీనివల్ల ఇంగ్లీష్‌పై పట్టు వస్తుందని అంటున్నారు.
ఇంగ్లీష్, మేథ్స్ సబ్జెక్టులను పిల్లలకు అర్థమయ్యేలా బోధించాలని గతేడాది చివరిలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బెంగళూరులోని ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా పలు జిల్లాల్లో ఏఐ ఆధారిత బోధనను ప్రారంభించింది. రాబోయే విద్యా సంవత్సరంలో 100 పాఠశాలల్లో అమలు చేయనుంది. 50 మందికి మించి విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు అందించాలని నిర్ణయించింది విద్యాశాఖ.
ALSO READ: బోనాలతో సంబురాలు మొదలు, పూర్తి షెడ్యూల్ ఇదే
కార్యరూపం దాల్చితే..
తొలుత ఒకటి, రెండు తరగతుల పిల్లలకు కంప్యూటర్లు నేర్పుతారు. నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు ఐఏని పరిచయం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి సిలబస్ ఖరారు కాలేదని అంటున్నారు ఓ అధికారి. రాష్ట్ర విద్యా పరిశోధన- శిక్షణ మండలి వీటి సిలబస్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
20 జిల్లాల్లో ప్రైమరీ స్కూళ్లలో వీటిని ప్రవేశపెట్టాలన్నది ఆలోచన. కరీంనగర్, వికారాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగాం, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నిర్మల్, సంగారెడ్డి, ములుగు జిల్లాలున్నాయి. అనుకున్నట్లుగా కార్యరూపం దాల్చితే రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏఐ పాఠాలు ప్రైమరీ స్కూళ్లకు అందుబాటులోకి రావడం ఖాయం.