OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు దశాబ్దం తరువాత ఓటీటీలోకి వచ్చేసింది ఐశ్వర్యా రాజేష్ నటించిన ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్. అది కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అరుళ్ నిధి, ఐశ్వర్య రాజేశ్, ఐశ్వర్య దత్త, రాధారవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ పేరు ‘గరుడ 2.0’ (Garuda 2.0). అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ మూవీ ‘ఆరత్తు సీనం’ (Aarathu Sinam) తెలుగు డబ్బింగ్ వెర్షన్, ఈ ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 2016లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆహా (Aha) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
ఏసీపీ అరవింద్ (అరుళ్ నిధి) ఒకప్పుడు నేరస్థులకు, అవినీతి అధికారులకు భయం అంటే ఏంటో చూపించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అయితే అతని జీవితంలో జరిగిన ఒక విషాదకర సంఘటన వల్ల జీవితం మారిపోతుంది. తన భార్య, బిడ్డలను కోల్పోవడం అన్నది అతన్ని తీవ్రమైన మానసిక అఘాతంలోకి నెట్టేస్తుంది. సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిన అరవింద్ తన ఉద్యోగానికి దూరమై, తాగుడికి బానిసై, బార్‌లలో టైమ్ గడుపుతూ నిరాశలో మునిగిపోతాడు. అతని తల్లి, తమ్ముడు అర్జున్ అరవింద్ తీరు చూసి టెన్షన్ పడతారు. ఎంత చెప్పినా మారకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తారు.
ఈ నేపథ్యంలో అరవింద్ పని చేసిన ఓ ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతాయి. ఈ కేసును అతని పై అధికారి జేసీ (రాధారవి) అరవింద్‌కు అప్పగిస్తాడు, అరవింద్ కు ఈ కేసు చేపట్టడం ఇష్టం లేకపోయిననా తనను గతం నుంచి, అది మిగిల్చిన బాధల నుంచి బయట పడేస్తుందని భావించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒప్పుకుంటాడు.
ఆ హత్యలను పరిశీలిస్తే ఒక సీరియల్ కిల్లర్ కేవలం అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేస్తూ, వాళ్ళను ఒకే విధంగా చంపి, శవాలను వేలాడదీస్తున్నట్లు తెలుస్తుంది. శవాలపై అర్థం కాని ‘లిపి’లో గాయాలు ఉండటం, ఆదివారం రోజు మాత్రమే శవాలను బయటపడేలా చేయడం అరవింద్ ను ఆశ్చర్యపరుస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న హంతకుడు చనిపోయిన వ్యక్తుల భార్యలపై పగతో ఈ పని చేస్తున్నట్లు అరవింద్ గుర్తిస్తాడు. అసలు ఆ కిల్లర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? హీరో గతం ఏంటి? అనేవి తెలియాలంటే మూవీని చూడాల్సిందే.
Read Also : ‘ఔసెప్పింటే ఒసియాతు’ మూవీ రివ్యూ… థియేటర్లలో రిలీజైన రెండు నెలల తరువాత ఓటీటీకి వచ్చిన మలయాళ మూవీ
ఈ కేసును ఛేదించే ప్రయత్నంలో అరవింద్ ఎదుర్కొనే సవాళ్లు, అతన్ని గత విషాదం నుంచి బయటపడే ప్రయాణం, హంతకుడిని పట్టుకోవడానికి అతను చేసే పోరాటఇంట్రస్టింగ్ గా సాగుతుంది. కథ మొదట్లో రొటీన్‌గా సాగినప్పటికీ, ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ వ్యక్తిగత జీవితంలో జరిగిన దుర్ఘటనలు, వాటి నుంచి కోలుకుని ఆయన మళ్ళీ యాక్టివ్ గా మారడం, సీరియల్ కిల్లర్‌ను ఎదుర్కొనే తీరు కథను ఆసక్తికరంగా మారుస్తాయి. దర్శకుడు అరివాజగన్ ఈ చిత్రాన్ని హై-ఇంటెన్సిటీ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం సస్పెన్స్, ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వారికి ఒక మంచి క్రైమ్ థ్రిల్లింగ్ ఎక్స్పిరియన్స్ ను ఇవ్వడం మాత్రం పక్కా.