BigTV English

Bigg Boss 8 Telugu: వారికే నా ఓటు.. వెళ్లిపోయే ముందు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీపై పృథ్వి కామెంట్స్

Bigg Boss 8 Telugu: వారికే నా ఓటు.. వెళ్లిపోయే ముందు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీపై పృథ్వి కామెంట్స్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోగా ఆదివారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో పృథ్వి ఎలిమినేట్ అయ్యాడు. చివరి వరకు విష్ణుప్రియా, పృథ్వినే డేంజర్ జోన్‌లో ఉన్నారు. దీంతో ఆడియన్స్‌లో మరింత ఎగ్జైట్మెంట్ పెరిగింది. చివరికి పృథ్వినే ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. తన ఎలిమినేషన్ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. విష్ణుప్రియా మాత్రమే పృథ్వి వెళ్లిపోతున్నందుకు ఎమోషనల్ అయ్యి ఏడ్చింది. తనను మిస్ అవుతానని, తను చాలా గొప్ప మనిషి అంటూ ఏడుస్తూ చెప్పింది.


వారు సూపర్ హిట్

బిగ్ బాస్ హౌస్ నుండి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తన జర్నీ చూసుకొని ఎమోషనల్ అయ్యాడు పృథ్వి. తన జర్నీలో గొడవలతో పాటు అమ్మాయిలతో ఫ్లర్టింగ్, విష్ణుప్రియాతో ప్రేమ, నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ కూడా ఉన్నాయి. ఇక కంటెస్టెంట్స్ అందరిలో సూపర్ హిట్ ఎవరు? సూపర్ ఫ్లాప్ ఎవరు? అని పృథ్విని అడిగారు నాగార్జున. సూపర్ హిట్ కేటగిరిలో నిఖిల్‌ను పెట్టి తను టాస్కులు బాగా ఆడతాడని, అందరితో బాగుంటాడని కారణం చెప్పాడు. నబీల్‌ను కూడా సూపర్ హిట్ కేటగిరిలోనే చేర్చాడు. నిఖిల్‌లాగానే నబీల్ కూడా టాస్కులు బాగా ఆడతాడు, అందరితో బాగుంటాడని అన్నాడు. ఇక అందరూ ఊహించినట్టుగానే విష్ణుప్రియాను కూడా సూపర్ హిట్ కేటగిరిలోనే చేర్చాడు పృథ్వి.


Also Read: స్ట్రాంగ్ కంటెస్టెంట్ పృథ్వీ ఔట్..13 వారాలకు ఎంత రెమ్యునరేషన్ అంటే..?

నామినేషన్స్‌లో లేరు

విష్ణుప్రియా అందరితో చాలా సరదాగా ఉంటుందని, తన వల్ల హౌస్‌లో చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు పృథ్వి. తనకు ఇష్టమైన వ్యక్తి అలా అనడంతో విష్ణు మరింత ఎమోషనల్ అయ్యింది. ఇక సూపర్ ఫ్లాప్ కేటగిరిలో ముందుగా రోహిణి పేరు పెట్టాడు. బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పటి నుండి రోహిణి అసలు నామినేషన్స్‌లోనే లేదు. ఒకసారి నామినేషన్స్‌లోకి వస్తే తను ఫైనల్‌కు వెళ్లాలా వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేస్తారని అన్నాడు పృథ్వి. ఇక అవినాష్‌ను కూడా సూపర్ ఫ్లాప్ కేటగిరిలో పెట్టి అదే కారణం చెప్పాడు. అవినాష్ ఒకేసారి నామినేషన్స్‌లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యాడు. అప్పుడు కూడా షీల్డ్ వల్లే సేవ్ అయ్యాడు అని గుర్తుచేశాడు.

పేరుపేరునా థ్యాంక్స్

బిగ్ బాస్‌ను వదిలి వెళ్లిపోయే ముందు తన ఓట్లు ప్రేరణ, నబీల్, నిఖిల్, విష్ణుప్రియాకే వేస్తానని అన్నాడు పృథ్వి. నాలుగు ఫోన్లు తీసుకొని నలుగురికి ఓట్లు వేస్తానని అన్నాడు. ఇక వెళ్లిపోయే ముందు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై అంతే ద్వేషం ఉందని నిరూపించి వెళ్లాడు. అంతే కాకుండా ఆడియన్స్‌కు కూడా ఒక ఎమోషనల్ మెసేజ్ అందించాడు. తను 13 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటానని అనుకోలేదని, తనను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఆడియన్స్‌కు థ్యాంక్స్ తెలిపాడు. 10 వారాలు నామినేషన్స్‌లోకి వచ్చినా తనను సేవ్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ పేరుపేరునా థ్యాంక్స్ అన్నాడు.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×