Coffee Face Scrub: చలికాలంలో చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ సీజన్‌లో చర్మం పొడిగా, గరుకుగా మారడంతో పాటు డీహైడ్రేషన్ అవుతుంది. చర్మం ఎల్లప్పుడూ మెరుస్తూ, మృదువుగా ఉండటానికి మంచి ఫేస్ స్క్రబ్ అవసరం. ఇవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా హైడ్రేట్‌గా ఉంచుతాయి.
చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయంలో చర్మానికి సరైన చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. మీరు మీ చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసి ఎక్స్‌ఫోలియేట్ చేసినప్పుడు చర్మంలోకి శోషించబడుతుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మీరు కాఫీ స్క్రబ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
DIY కాఫీ ఫేస్ స్క్రబ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని వాడటం వల్ల చర్మం సహజంగా మెరుస్తూ ఉండటంతో పాటు, డీప్ క్లీన్ చేయడం ద్వారా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శీతాకాలంలో మెరుగైన చర్మ సంరక్షణ కోసం కొన్ని DIY కాఫీ ఫేస్ స్క్రబ్‌లు ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కాఫీ స్క్రబ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
1. కాఫీ, తేనె స్క్రబ్:
కావలసినవి:
కాఫీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
తయారీ విధానం:
ఒక బౌల్‌లో రెండు చెంచాల కాఫీ పౌడర్, ఒక చెంచా తేనెను బాగా మిక్స్ చేసి ఆపై ముఖంపై 5-10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
తేనె చర్మాన్ని తేమగా చేస్తుంది. కాఫీ మృత చర్మ కణాలను తొలగిస్తుంది.
2. కాఫీ,కొబ్బరి నూనె, చక్కెర స్క్రబ్
కావలసినవి:
కాఫీ పౌడర్- 1 టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్
చక్కెర- 1 టీ స్పూన్
తయారీ విధానం:
ఒక బౌల్‌లో పైన చెప్పిన పదార్థాలను తీసుకుని బాగా మిక్స్ చేయండి. తర్వాత వీటిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. ఇందులో వాడిన కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చక్కెర చర్మాన్ని శుభ్రపరుస్తుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ముఖం కాంతివంతగా మారుతుంది. ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి మచ్చలేని చర్మంమీ సొంతం అవుతుంది.
3. కాఫీ, రోజ్ వాటర్ స్క్రబ్
కావలసినవి:
కాఫీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ – తగినంత
Also Read: మీగడ ఇలా వాడితే.. అమ్మాయిలే అసూయపడే అందం
తయారీ విధానం:
ఒక చెంచా కాఫీ పౌడర్‌లో ఒక చెంచా రోజ్ వాటర్ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. 15 నిమిషాల పాటు ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.