Tesla Cybertruck Blast Driver| 2025 నూతన సంవత్సరం తొలి రోజే అమెరికా రెండు హింసాత్మక దాడులు జరిగాయి. మొదటి దాడి న్యూ ఓర్లియన్స్‌లో ఒక పికప్ ట్రక్కు దాడి. ఈ దాడిలో ఒక మాజీ అమెరికా సైనికుడు.. రెంటుపై తీసుకున్న పికప్ ట్రక్కుని న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. ఆ తరువాత అతను పోలీసులు కాల్పుల్లో మరణించారు. అయితే రెండో దాడి లాస్ వెగాస్ నగరంలో ట్రంప్ ఇంటర్నేషన్నల్ హోటల్ బయటే జరిగింది. ఈ దాడి ఒక అమెరికన్ రిటైర్డ్ సైనికుడే చేయడం షాకింగ్ విషయం. రెండు దాడుల్లో కూడా నిందితులు భార్యల నుంచి విడిపోయిన వారు, గొడవపడినవారే ఉండడం గమనించాల్సిన విషయం.
లాస్ వెగాస్ నగరంలో జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు మ్యాథ్యూ లివెల్స్‌బర్గెర్ (37) టెస్లాకు చెందిన ఒక ఎలెక్ట్రిక్ సైబర్ ట్రక్కుని టూరో యాప్ ద్వారా రెంటుకి తీసుకున్నాడు. ఆ సైబర్ ట్రక్కులో పెట్రోల్ క్యానిస్టర్లు, పేలుడ పదార్థాలు అమర్చి వాటిని డెటోనేటర్ లో పేల్చాడు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరో షాకింగ్ విషయం బయటపడింది. నిందితుడు మ్యాథ్యూ మరణం తుపాకీతో తనను తాను కాల్చుకోవడం వల్లనే జరిగిందని తేలింది. అంటే టెస్లా సైబర్ ట్రక్కుని పేల్చే ముందు మ్యాథ్యూ ముందుగా తనను తాను కాల్చుకున్నాడు.
Also Read: పందెం కాశాడు.. 20 నిమిషాల్లో 2 విస్కీ బాటిళ్లు పచ్చిగానే.. ఎంత సంపాదించాడంటే!?
మ్యాథ్యూ.. కొలరాడో స్ప్రింగ్స్ ప్రాంతంలో నివసించేవాడు. అతనికి భార్య ఒక చిన్నారి కూతురు ఉన్నారు. అయితే క్రిస్మస్ రోజు మ్యాథ్యూ తన భార్యతో గొడవపడ్డాడు. మ్యాథ్యూకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న అతని భార్య గతంలో కూడా అతనితో గొడవ పడింది. అయితే క్రిస్మస్ రోజు కూడా మ్యాథ్యూ తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో క్రిస్మస్ మరుసటి రోజు మ్యాథ్యూ తన ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. ఆ తరువాత తనతో మాట్లాడలేదని అతని భార్య పోలీసుల విచారణలో తెలిపింది. మ్యాథ్యూ చేసిన టెస్లా ట్రక్కు పేలుడు దాడిలో ఏడుగురుకి స్వల్ప గాయాలయ్యాయి.
మ్యాథ్యూ లివెల్స్‌బర్గెర్.. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరామని అని తండ్రికి సోదరుడు డీన్ లివెల్స్‌బర్గెర్ తెలిపారు. దేశాన్ని ఎంతగానో ప్రేమించేవాడని.. అందుకే సైన్యంలో చేరడాని ఆయన తెలిపారు. అమెరికా సైన్యం స్పెషల్ ఫోర్సెస్ టీమ్ లో కమాండోగా సేవలందించిన మ్యాథ్యూ లివెల్స్‌బర్గెర్ వియత్నాం యుద్ధంలో కూడా పాల్గొన్నాడు.
అయితే న్యూ ఓర్లియన్స్ లో జరిగిన దాడిలో నిందితుడు షంసుద్దీన్ జబ్బార్ పై మాత్రం ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉండేదని ఎఫ్‌బిఐ తెలిపింది. కానీ మ్యాథ్యూ కేసులో ఉగ్రవాద కోణం కనిపించలేదని అధికారులు తెలిపారు.