వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతం.. తరచుగా డాక్టర్ల నుంచి మనం వినే మాట. తాజాగా మహారాష్ట్రాలో ఇలాంటి ఘటనే జరిగింది. డాకర్లే చనిపోయాడని తేల్చిన వ్యక్తి డెడ్ బాడీనికి ఇంటికి తీసుకెళ్తుండగా, ఒక్కసారిగా లేవడంతో అందరూ షాక్ అయ్యారు. మరికొద్ది నిమిషాల్లో చితిమంటల్లో కావాల్సిన వ్యక్తి కళ్లు తెరవడంతో షాకయ్యారు. ఈ వింత ఘటన గురించి తెలుసుకుని జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గత ఏడాది డిసెంబర్ 16న కొల్హాపూర్ జిల్లా కసాబా-బావడాకు చెందిన 65 ఏండ్ల పాండురంగ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ సిబ్బంది ఐసీయూకి తీసుకెళ్లారు. డాక్టర్ వచ్చి చెక్ చేశారు. దారిలోనే ప్రాణం పోయినట్లు వెల్లడించారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విషయం ఇంటి దగ్గరి వారికి చేరవేశారు. పాండు చనిపోయాడని చెప్పారు. కడసారి చూపు కోసం బంధుమిత్రులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అటు హాస్పిటల్ నుంచి డెడ్ బాడీనికి తీసుకెళ్లేందుకు ఓ అంబులెన్స్ ను మాట్లాడుకున్నారు.
స్పీడ్ బ్రేకర్ కుదుపులకు పాండుకు ప్రాణం
ఇక హాస్పిటల్ నుంచి పాండు డెబ్ బాడీని అంబులెన్స్ లోకి తీసుకెళ్లారు. చీకటి పడుతుండటంతో కుటుంభ సభ్యులు త్వరగా డెడ్ బాడీనికి తీసుకురావాలని ఆత్రపెట్టారు. కాస్త స్పీడ్ గా తీసుకెళ్లాలనని కుటుంబ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్ కు చెప్పారు. వారు చెప్పినట్లుగానే అంబులెన్స్ స్పీడ్ పెంచాడు. గంటకు సుమారు 80 కి.మీ వేగంతో ముందుకు నడిపాడు. దారిలో ఓ పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది. దాన్ని గమనించకుండా డ్రైవర్ అలాగే వెళ్లాడు. ఒక్కసారిగా అంబులెన్స్ పెద్ద కుదుపుకు గురయ్యింది. ఈ కుదుపుకు పాండు బాడీ అటు ఇటు కదిలింది. నెమ్మదిగా పాండు చేతి వేళ్లు కదిలాయి. ఆయన భార్య వెంటనే ఈ విషయాన్ని గుర్తించింది. అంబులెన్స్ డ్రైవర్ కు చెప్పింది. మళ్లీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలనని కోరింది. అంబులెన్స్ ను తిప్పి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.
Read Also:ప్రపంచంలోనే అదిపెద్ద ట్రాఫిక్ జామ్.. 12 రోజుల పాటు రోడ్డు మీదే నరకం చూసిన వాహనదారులు!
పాండు బతికే ఉన్నాడని చెప్పిన డాక్టర్లు
డాక్టర్లు పాండును పరీక్షించి అతడు ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పారు. వెంటనే ఐసీయూలో ఉంచి యాంజియో ప్లాస్టీ చేశారు. రెండు వారాల పాటు హాస్పిటల్ లోనే ఉండి పూర్తిగా కోలుకున్నాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయాడు అనుకున్న పాండు తిరిగి కోలుకుని ఇంటికి చేరడంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఒకవేళ స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఆయన బతికుండగానే చితి పేర్చేవారంటున్నారు. మరోవైపు బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని డాక్టర్లు చెప్పడంపై పాండు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు హాస్పిటల్ యాజమాన్యం మీద కేసు వేస్తామని తేల్చి చెప్పారు. మొత్తంగా ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదృష్టం అంటే పాండుదే అంటున్నారు.
Read Also: మేఘాలపై మనుషులు.. విమాన ప్రయాణికులకు వింత అనుభవం, వీడియో వైరల్!