Coffee Health Benefits: మనలో చాలా మంది రోజును వేడి టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే..రోజంతా ఉత్సాహంగా ఉంటాము. ఈ రెండు శరీరాన్ని రోజంతా తాజాగా, శక్తివంతంగా ఉంచుతాయి. కానీ ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగడం కేవలం అలవాటు మాత్రమే కాదు.. మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని మీకు తెలుసా ? అవును ఒక కప్పు కాఫీ మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.
ఉదయం కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మెదడు బలపడుతుంది:
కాఫీ తాగడం వల్ల మన మెదడు ఉత్తేజితమై శక్తివంతమవుతుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం దీనిని తాగడం వల్ల మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. రోజంతా ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మీ దృష్టి , ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే.. కాఫీ మానసిక స్థితిని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయం:
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. ఉదయం కాఫీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం అనే మూలకం శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఊబకాయాన్ని నివారిస్తుంది.
ముఖ్యంగా బ్లాక్ కాఫీలో ఎక్కువ మొత్తంలో కెఫిన్ ఉంటుంది. కాబట్టి ఇది మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శక్తిని కాపాడుకోవడంలో సహాయపడుతుంది:
మీరు ప్రతి రోజు ఉదయం టిఫిన్ తో పాటు ఒక కప్పు కాఫీ తాగితే.. అది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడుతుంది. కెఫిన్ ఏకాగ్రతను పెంచుతుంది. అంతే కాకుండా అలసటను కూడా తొలగిస్తుంది. దీంతో పాటు.. కాఫీ ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మళ్లీ మళ్లీ తినాలనే కోరికను కూడా నిరోధిస్తుంది. అందుకే చాలా మంది ఉదయం ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించడానికి ఇష్టపడతారు.
Also Read: ఈ ఫేస్ ప్యాక్స్ వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం
ఉదయం కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు:
ఉదయాన్నే లేదా నిద్రలేచిన వెంటనే కాఫీ తాగడం వల్ల కొంతమందికి అసిడిటీ, గ్యాస్ లేదా గుండెల్లో మంట రావచ్చు.
కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అంతే కాకుండా నిద్ర లేమి ,ఒత్తిడి కూడా పెరుగుతాయి.
రోజు కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి పగటిపూట పరిమిత పరిమాణంలో కాఫీ తీసుకోవడం మంచిది.