BigTV English

Face Pack For Open Pores: ఈ ఫేస్ ప్యాక్స్ వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Face Pack For Open Pores: ఈ ఫేస్ ప్యాక్స్ వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Face Pack For Open Pores: మీ ముఖంపై ఓపెన్ పోర్స్ ఉంటే.. ఇది ఒక సాధారణ చర్మ సమస్య కావచ్చు. దీనివల్ల చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. చర్మంపై కనిపించే అదనపు నూనె సమస్య వయస్సు మీద పడటం వల్ల కూడా ఇది జరగవచ్చు. మీరు ముఖ రంధ్రాలను పూర్తిగా తొలగించలేకపోయినా.. సరైన చర్మ సంరక్షణతో మీరు వాటిని తగ్గించవచ్చు. చర్మాన్ని బిగుతుగా చేసి, సహజంగా తెరుచుకున్న రంధ్రాలను తగ్గించడంలో సహాయపడే 6 ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్‌లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్:
ముల్తానీ మిట్టి ముఖంపై నూనెను పీల్చుకునే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ముఖ రంధ్రాలను తెరుచుకోవడానికి అంతే కాకుండా కుదించడానికి సహాయపడుతుంది.

కావాల్సిన పదార్థాలు:
ముల్తానీ మిట్టి-2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్-1 టేబుల్ స్పూన్


ఎలా తయారు చేయాలి ?
పైన తెలిపిన పదార్థాలను అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేయండి. తర్వాత మీ ముఖం మీద సమానంగా అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత చల్లటి నీటితో కడిగేయండి. మెరుగైన ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ని ఉపయోగించండి.

2. ఎగ్ వైట్, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
ఎగ్ వైట్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయ కూడా చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు

ఎగ్ వైట్- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్

ఎలా తయారు చేయాలి ?
గుడ్డులోని తెల్లసొనను కొట్టి, దానికి పైన తెలిపిన మోతాదులో నిమ్మరసం కలపండి. దీనిని మీ ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వండి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మృదువైన చర్మం కోసం వారానికి ఒకసారి దీనిని తప్పకుండా అప్లై చేయండి.

3. కలబంద, దోసకాయ ప్యాక్:
కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా దోసకాయ చర్మ రంధ్రాలను సడలించి బిగుతుగా చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు:
కలబంద జెల్-2 టీస్పూన్లు
దోసకాయ రసం- 1 టీస్పూన్

ఎలా తయారు చేయాలి ?
పైన తెలిపిన రెండు పదార్థాలను బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని మీ ముఖంపై 20 నిమిషాలు అప్లై చేయండి. తరువాత చల్లటి నీటితో వాష్ చేయండి. మెరుగైన ఫలితాల కోసం ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ మీ ముఖంపై అప్లై చేయండి.

4. ఓట్ మీల్ , పెరుగు ఫేస్ ప్యాక్:
ఓట్ మీల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. పెరుగు చర్మాన్ని బిగుతుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

కావాల్సిన పదార్థాలు:
ఓట్ మీల్ – 2 టేబుల్ స్పూన్ల
పెరుగు- 1 టేబుల్ స్పూన్

ఎలా తయారు చేయాలి ?
ఓట్ మీల్ ను మెత్తగా రుబ్బి పెరుగుతో కలపండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై సమానంగా అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. మృదువైన చర్మం కోసం వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ఉపయోగించండి.

Also Read: మీ అందం చెక్కు చెదరకుండా ఉండాలంటే.. ?

5. టమాటో , తేనె ఫేస్ ప్యాక్:

టమాటాలో యాంటీఆక్సిడెంట్లు , సహజ ఆస్ట్రింజెంట్లు ఉంటాయి. తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు:
1 చిన్న టమాటో గుజ్జు
తేనె- 1 టీస్పూన్

ఎలా తయారు చేయాలి ?
టామాటో గుజ్జును తేనెతో కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. మెరుగైన ఫలితాల కోసం.. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు అప్లై చేయండి.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×