Cooking Tips: వంట చేయు ..కాని పెంట చేయకు ..ఇది చాలా ఇళ్ళల్లో వినబడే కామన్ డైలాగ్.ఎందుకంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎదురుగా రుచి పచి లేని ఫుడ్ ని వడ్డిస్తే ఎవరికైనా కోపం రావడం ఖాయం.అందుకే ఏది ఎలా ఉన్నా తినే ఫుడ్ మాత్రం టేస్టీ గా ఉండాలనుకుంటారు.పైగా పోషకాలు వంటివి అస్సలు మిస్ కాకూడదని కోరుకుంటారుమరి వంటని చేస్తున్నప్పుడు మనం ఏం తప్పులు చేస్తామో తెలిస్తేనే కదా వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకునేది.సో ..అస్సలు చేయకూడని ఆ పది తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం!
ముందు కోసి తర్వాత నీళ్లలో కడిగే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అలా చేస్తే విటమిన్-సి, బి-కాంప్లెక్స్ లాంటి పోషకాలు నీళ్లలో కలిసిపోతాయి. అందుకే ముందు కడిగి తర్వాతే తరగాలి.
నూనె బాగా కాగిన వెంటనే అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి వేసి అదే హై ఫ్లేమ్‌లో ఉంచేస్తారు. దీంతో మసాలాలు మాడిపోయి మొత్తం కూర రుచి పాడవుతుంది. మసాలాలు వేసిన వెంటనే మంట తగ్గిస్తే చాలు రుచి కూడా బాగుంటుంది, వాసన కూడా అద్భుతంగా వస్తుంది.
“ఒక్కసారి అయిపోతుంది” అనుకుని ఒకేసారి బాణలి నిండా కూరగాయలు లేదా ఫ్రై చేసే పదార్థాలు వేయొద్దు. అలా చేస్తే అవి వేగవు… ఆవిరితో ఉడికిపోతాయి. క్రిస్పీగా రావాలంటే పాన్‌లో కాస్త ఖాళీ ఉండాల్సిందే.
చాలామంది స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టగానే నూనె పోసేస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ముందు పాన్ కాస్త వేడెక్కాలి. ఆ తర్వాతే నూనె వేయాలి. లేదంటే నూనె బాగా వేడికాకుండా కూరగాయలు, మసాలాలు ఎక్కువ నూనె పీల్చుకుని కూర జిడ్డుగా మారుతుంది.
వంట అయిపోయిన వెంటనే కడాయి లేదా బాణలిని సింక్‌లో పెట్టి నీళ్లు పోస్తుంటారు. దీంతో పాత్రలు వంకర అయ్యే అవకాశం ఉంటుంది.పైగా నాన్-స్టిక్ అయితే కోటింగ్ కూడా పాడవుతుంది. కాబట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాతే కడగాలి.
ఇది చాలా మంది చేసే కామన్ మిస్టేక్. స్టీలు గరిటెతో కలపడం వల్ల నాన్-స్టిక్ కోటింగ్ ఊడిపోతుంది. తర్వాత అదే ఆహారంలో కలిసే ప్రమాదం ఉంటుంది. అందుకే చెక్క లేదా సిలికాన్ గరిటెలు వాడటం మంచిది.
ముఖ్యంగా ఆకుకూరలు, గ్రేవీలు ఉడికిన తర్వాత పరిమాణం తగ్గిపోతుంది. మొదట్లోనే ఎక్కువ ఉప్పు వేస్తే తర్వాత తినలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి కొద్దికొద్దిగా వేస్తూ చివర్లో రుచి చూసి అవసరమైతే మరికొంచెం వేయండి.
ఫ్రిజ్‌లో ఉన్న మాంసాన్ని తీసిన వెంటనే స్టవ్ మీద పెట్టేస్తే బయట మాత్రమే ఉడికి, లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. కనీసం 20 నుంచి 30 నిమిషాలు బయట పెట్టి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వండితే బాగా ఉడుకుతుంది.
ఇక “ఉడికిందా లేదా?”.. “ఉడికిందా లేదా?” అని ప్రతి రెండు నిమిషాలకు మూత తీసి చూడటం వల్ల లోపల ఉన్న వేడి, ఆవిరి బయటకుపోతుంది. దాని దాని వల్ల వంట ఆలస్యమవుతుంది. కాబట్టి అవసరం ఉన్నప్పుడే మూత తీసి చూడండి.
ఇక చాలా మంది ఇపుడు సీరియల్స్ చూస్తూనో లేక ఫోన్ లో రీల్స్ చూస్తూనో వంట చేయడం ఇప్పుడు చాలామందికి అలవాటైంది. కానీ అదే పెద్ద ప్రమాదం.ఎందుకంటే మీరు గనుక ఆ ఫోన్ లోనే మునిగిపోతే మాత్రం కూర మాడిపోవచ్చు, ఇక ఉప్పు లేదా కారం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.ఇక ఆ తర్వాత మీకు, మీవారికి యుద్ధం పక్కా.సో వంట చేస్తున్నప్పుడు పూర్తి ఫోకస్ వంటపైనే ఉండాలి.
also read :కిచెన్‌లో ఈ చిన్న తప్పులే.. నెలాఖరుకి పర్సు ఖాళీ చేస్తాయి!
పూరీలు, బజ్జీలు లేదా పకోడీలు వేయించిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా పదేపదే వేడి చేసిన నూనెలో హానికరమైన పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి నూనెను మళ్లీ వంటకు ఉపయోగించకుండా ఉండండి.
also read :రీల్స్ చూస్తున్నారా..? అయితే ఇది ఒక్కసారి చదవండి
మొత్తంగా వంట అనేది కష్టమైన పని కాదు…కాని అది ఎలా చేయాలనేదే తెలిసి ఉండాలి.మరి ఈ పది తప్పులు రిపీట్ కాకుండా ఈ సారి వంట సరిగ్గా ,టేస్టీ గా చేస్తారు కదూ !