The Paradise:పక్కింటి అబ్బాయి పాత్రలు బోర్ కొట్టాయేమో ..రూట్ మార్చి యాక్షన్ బాట పట్టాడు నాని. అలా శ్రీకాంత్ ఓడెల కాంబోలో చేసిన దసరా సూపర్ హిట్ అయి ఏకంగా వందకోట్లు అందుకుంది కూడా.దీంతో ఇదే కాంబో మరోసారి జత కట్టి ఫ్యారడైజ్ అంటూ మరో సినిమా అనౌన్స్ చేయడంతో ఈ జోడీపై ఎక్కడ లేని అంచనాలు పెరిపోయాయి.
ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన గ్లిమ్ప్స్ అలాగే ఆయా షేర్ ,ఎషనాగుల కట్ట మీద పాటలు సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదుచూశారు .ఇక అభిమానుల ఎదురుచూపులకి ఎండ్ కార్డ్ వేస్తూ సినిమా ఎట్టకేలకి ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
అయితే సినిమా అనుకున్నంతగా లేదంటూ డీలా పడిపోతున్నారంతా .అనుకున్నది ఒకటైతే అయింది మరొకటి అంటూ డిసప్పాయింట్ అయిపోయారు.మరింతకీ అసలు ఈ సినిమాలో తేడా ఎక్కడ కొట్టింది? చూసేద్దాం !
రెగ్యులర్ టెంప్లెట్
శ్రీకాంత్ ఓదెల రెగ్యులర్ టెంప్లెట్ అయిన అణచివేతకు గురైన ఒక వర్గం, వాళ్లపై ఆధిపత్యం చలాయించే విలన్, ఆ వ్యవస్థకు ఎదురుతిరిగే హీరో, వెనుక తల్లి సెంటిమెంట్, కట్ చేస్తే చివర్లో హీరో ఎదగడం అనే పరమ రొటీన్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడం తో తప్పటడుగు వేశాడని చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి కథల్ని మన ఆడియన్స్ చూసి చూసి పండిపోయారు.ఇక ఈ మధ్య వచ్చిన kgf, సలార్ వంటి సినిమాల్లో కూడా ఇదే టెంప్లెట్ కనిపిస్తుంది.
పండని ఎమోషనల్ ఎలిమెంట్
ఇక సినిమాలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే నాని వేసిన జడల్ పాత్రకి కావాల్సినంత బరువైన బ్యాక్‌స్టోరీ ఉంది.ఇందులో తల్లి కొడుకు ఎమోషన్ ని గట్టిగానే దట్టించాడు శ్రీకాంత్.కానీ అది కథను ముందుకు తీసుకెళ్లే డ్రివెన్ ఫోర్సు లా కాకుండా కేవలం ఒక ఎమోషనల్ ఎలిమెంట్‌గానే మిగిలిపోయిందని చెప్పాలి.
kgf, లో రాకీ భాయ్- తల్లికి మధ్య సెంటిమెంట్ ఎంతలా పండిందో తెల్సిందే. ఇక ‘దసరా’లో ధరణికి అతని బలహీనతలు, స్నేహం, ప్రేమ కథను నడిపించాయి. కానీ ఇందులో అలాంటి సాలిడ్ ఎలిమెంట్ మిస్ అవడంతో ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోయారు.
టగ్ ఆఫ్ వార్ సీన్స్ అన్నీ మిస్
స్క్రీన్‌ప్లే కూడా సినిమాకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌లో జడల్ ప్రపంచాన్ని, పాత్రలను పరిచయం చేస్తూ ఆసక్తికరంగానే కథనం సాగింది. కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను పక్కనపెట్టి కేవలం మాస్ ఎలివేషన్ల మీదే ఆధారపడిపోయాడు డైరెక్టర్ శ్రీకాంత్ .దీంతో హీరో, విలన్ కి మధ్య పడాల్సిన టగ్ ఆఫ్ వార్ సీన్స్ అన్నీ మిస్ అయిపోయాయి.
నిజానికి విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత పండుతుందని చెప్పక్కర్లేదు.ఆ మ్యాజిక్కే ఇక్కడ మిస్ అయింది. ఇక హీరోయిన్ కయాదు లోహర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.ఆవిడ ఎందుకుందో దర్శకుల వారికే తెలియాలి.
ఎలివేషన్ల దగ్గరే ఆగిపోయిన శ్రీకాంత్
చివరిగా చూస్తే.. ‘ది ప్యారడైజ్’లో మాస్ లేదు అనలేం, కావాల్సినంత ఉంది. విజువల్స్, బీజీఎం అన్నీ సాలిడ్ గా దట్టించాడు డైరెక్టర్.కానీ ఇవన్నీ వీటన్నింటిని కలిపి చూస్తే మాత్రం ఆడియన్స్ కి స్పెషల్ ఇంపాక్ట్ ని ఈ సినిమా కలిగించలేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమోషన్ ని ఎలివేషన్ ని బ్లెండ్ చేయాలనుకున్న డైరెక్టర్ జస్ట్ ఎలివేషన్ల దగ్గరే ఆగిపోయాడు.
నిజానికి మాస్ సినిమా స్లోగానే మొదలవ్వచ్చు. క్యారెక్టర్లను పరిచయం చేయడానికి టైమ్ తీసుకోవచ్చు. కానీ ప్రతి సీన్ తర్వాత “ఇప్పుడు ఏం జరుగుతుంది?” అనే ఆసక్తి ఉండాలి. ఫస్ట్ హాఫ్‌లో ప్రపంచాన్ని నిర్మిస్తూ, పాత్రలను పరిచయం చేస్తూ వెళ్లిన సినిమా.. సెకండాఫ్‌లో ఎలివేషన్స్ మీద ఎక్కువగా ఆధారపడితే ఇదిగో ఇలాంటి ఫలితాలే వస్తాయి.