E-Paper
Advertisement

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత
Advertisement

Dopamine dating trend| ఒకప్పుడు డేటింగ్ అంటే ప్రేమ, అనుబంధం, భవిష్యత్తు గురించి ఆలోచించడం. ఇప్పుడు డేటింగ్ అంటే యాప్స్‌లో ఒక్క స్వైప్‌తో కొత్త పరిచయం మొదలవుతోంది. కొత్త వ్యక్తి మెసేజ్ చేయడం, అటెన్షన్ ఇవ్వడం, కలవడం వంటి చిన్న అనుభవాలే కొందరిలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఈ కొత్త అనుభవాల చుట్టూ ఇప్పుడు “డోపమైన్ డేటింగ్” అనే ట్రెండ్ చర్చలోకి వచ్చింది.

అసలు డోపమైన్ డేటింగ్ అంటే ఏమిటి?

డోపమైన్ డేటింగ్‌లో ప్రేమ, కమిట్‌మెంట్ కంటే ఉత్సాహం, కొత్తదనం ఎక్కువగా ప్రధానంగా ఉంటాయి. కొంతమంది సీరియస్ రిలేషన్‌షిప్ కోసం కాకుండా బోర్ కొట్టినప్పుడు కొత్త వ్యక్తులను కలవడానికి డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తారు. కొత్త మ్యాచ్ రావడం, మెసేజ్ అందుకోవడం లేదా ఎవరో మనపై ఆసక్తి చూపడం ఉత్సాహాన్ని కలిగిస్తాయి. డోపమైన్ మెదడులో రివార్డ్, మోటివేషన్, ఆనంద భావనలకు సంబంధించిన న్యూరోట్రాన్స్‌మిటర్. అందుకే కొత్త పరిచయాల నుంచి వచ్చే ఉత్సాహాన్ని మళ్లీ మళ్లీ కోరుకునే అవకాశం ఉంటుంది. అయితే డేటింగ్ యాప్ ఉపయోగించే ప్రతి వ్యక్తి కమిట్‌మెంట్‌కు దూరంగా ఉంటారని దీని అర్థం కాదు.

డేటింగ్ యాప్స్ ఈ ట్రెండ్‌లో ఎందుకు భాగమవుతున్నాయి?

Advertisement

డేటింగ్ యాప్స్ కొత్త వ్యక్తులను కలవడాన్ని చాలా సులభం చేశాయి. కొన్ని నిమిషాల్లోనే అనేక ప్రొఫైల్స్ చూడటం, మ్యాచ్ కావడం, మాట్లాడటం సాధ్యమవుతోంది. కొంతమందికి ఈ కొత్త అవకాశాలు వినోదంగా అనిపిస్తాయి. బోర్‌గా ఉన్నప్పుడు లేదా ఒంటరితనం అనిపించినప్పుడు కొత్త పరిచయాలు తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే ఎప్పుడూ కొత్త అటెన్షన్ కోసం వెతకడం వల్ల సంబంధాల్తో ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంది.

పాత రిలేషన్‌షిప్‌లో కూడా కొత్త స్పార్క్

డోపమైన్ డేటింగ్ వల్ల పాత సంబంధాల్లో కొత్తదనం తీసుకురావడానికి కూడా ఉపయోగపడతాయి. రిలేషన్‌షిప్ మొదట్లో ఉండే ఉత్సాహం కొంతకాలం తర్వాత తగ్గడం సహజం. అప్పుడు కొత్త వ్యక్తిని వెతకాల్సిన అవసరం లేకుండా భాగస్వామితోనే కొత్త అనుభవాలను ప్రయత్నించవచ్చు. అనుకోకుండా డేట్ ప్లాన్ చేయడం, కొత్త ప్రదేశానికి వెళ్లడం లేదా కలిసి కొత్త హాబీ ప్రయత్నించడం లాంటివి చేయాలి. చిన్న మార్పులు కూడా రోజువారీ జీవితాన్ని ఆసక్తికరంగా మార్చగలవు.

రిలేషన్‌షిప్‌లో మీ సొంత గుర్తింపును కూడా కాపాడుకోవాలి

Advertisement

ఆరోగ్యకరమైన సంబంధం కోసం లవర్స్ ప్రతి క్షణం కలిసి ఉండాల్సిన అవసరం లేదు. స్నేహితులను కలవడం, హాబీలను కొనసాగించడం, కుటుంబంతో సమయం గడపడం ముఖ్యమే. ఇలా సొంత ఆసక్తులను కొనసాగిస్తే భాగస్వామితో పంచుకోవడానికి కొత్త విషయాలు ఉంటాయి. అవి కొత్త సంభాషణలకు దారితీసి భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతాయి.

Also Read: ప్రతి ఒక్కరు తమ ప్రేమను వ్యక్తపరిచే భాష వేరు.. మీ పార్ట్‌నర్ ప్రేమ భాషను ఇలా తెలుసుకోండి

సరదా, నవ్వు కూడా సంబంధాన్ని తాజాగా ఉంచుతాయి

ఎప్పుడూ కోపం, చిరాకు లేదా ప్రతికూలతతో ఉండటం సంబంధాన్ని భారంగా మారుస్తాయి. కలిసి నవ్వుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం సంబంధంలో మంచి వాతావరణాన్ని సృష్టించవచ్చు. కొత్త రెస్టారెంట్‌కు వెళ్లడం, చిన్న ట్రిప్ ప్లాన్ చేయడం లేదా ఒకరినొకరు సర్‌ప్రైజ్ చేయడం ప్రయత్నించవచ్చు. ఇలాంటి చిన్న అనుభవాలు రొటీన్‌ను మార్చి మంచి జ్ఞాపకాలను సృష్టిస్తాయి.

సంబంధాన్ని త్వరగా ముందుకు తీసుకెళ్లకుండా నెమ్మదిగా సాగించాలి

మంచి సంబంధానికి సమయం, సహనం, పరస్పర అవగాహన అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఇద్దరి మధ్య ఒత్తిడిని పెంచవచ్చు. బదులుగా భాగస్వామి చేసే చిన్న చిన్న పనులను గమనించి అభినందించాలి. కొత్త అనుభవాల కోసం ప్రతిసారీ కొత్త వ్యక్తి అవసరం లేదు. కొన్నిసార్లు ఉన్న సంబంధాన్ని కొత్త కోణంలో చూడటం కూడా సరిపోతుంది.

Also Read: నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి

డోపమైన్ డేటింగ్ కొత్తదనం ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది

కొత్త అనుభవాలు మనకు ఉత్సాహాన్ని ఇవ్వగలవు. కానీ ఉత్సాహం మాత్రమే బలమైన సంబంధానికి సరిపోదు. నమ్మకం, కమ్యూనికేషన్, భావోద్వేగ అనుబంధం కూడా దీర్ఘకాలిక సంబంధానికి అవసరం. అందుకే డోపమైన్ డేటింగ్ ట్రెండ్‌.. కొత్త లవర్ కోసం వెతకడం కంటే, ఉన్న సంబంధంలో కొత్తదనం తీసుకురావడానికి కూడా ఉపయోపడే పద్ధతిగా చూడాలి.

Tags

Related News

మీ వయసు పదేళ్లు తగ్గిపోతుంది.. నిత్యయవ్వన చర్మం కోసం ఈ 7 సూపర్ జ్యూస్‌లు తాగండి

పిల్లలు హైట్ పెరగడం లేదా? రోజూ ఈ 5 యోగాసనాలు వేయండి.. ఆగకుండా ఎత్తు పెరుగుతారు

అసలు జ్ఞాన దంతాలతో ఉపయోగం ఉందా? వీటిని ఎప్పుడు తొలగించాలి

ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే

నమ్మకానికి మారుపేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టాల్లో తోడుగా నిలబడే స్నేహితులు

ఎంత సంపాదించినా పేదరికంలోనే ఉంటారు.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?

వేగంగా ముసలిబారుతున్న మెదుడు.. మీరు చేస్తున్న ఈ తప్పులే కారణం

Big Stories

Advertisement
×