Reels Addiction:రీల్స్… ఇవి చూడకపోతే మన రోజు గడవదు. మొదటగా సరదాగా ఒక రీల్ చూద్దాం లే అని ఓపెన్ చేస్తే, ఆ తర్వాత అది మనలోని బానిసని మేల్కొలుపుతుంది.ఇంకేం… సరదాగా “ఒక్క రీల్ చూసి పడుకుందాం…” అని మొదలెట్టిన రీల్స్ ప్రయాణం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎంతలా అంటే గంటలు కూడా సెకన్లలా గడిచిపోయేంత.అలా అని ఇది ఏ ఒక్కరి పరిస్థితో కాదు. నీది, నాది… అందరి కథ ఇదే.నిజానికి రీల్స్ చూడటం తప్పు కాదు. మైండ్ కాసింత ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటే తప్పు లేదు. కానీ అది కాస్తా వ్యసనంగా మారితేనే అసలు సమస్య.మరి రీల్స్ కంటిన్యూగా చూస్తే వచ్చే సమస్యలు ఏంటో… వాటి నుండి ఎలా బయటపడవచ్చో కాస్త డిస్కస్ చేసుకుందాం రండి.
రీల్ ఎంతసేపు ఉంటుంది? అయితే 20 సెకన్లు… లేదా 30 సెకన్లు… ఇదిగో ఈ సమయమే మనల్ని కట్టిపడేస్తుంది.మొదటగా ఫన్నీ వీడియో, ఇంకొకటి ఎమోషనల్ వీడియో, తర్వాత డాన్స్ వీడియో, మళ్లీ కుకింగ్ వీడియో…కొద్ది సేపే కదా అని చూడటం మొదలెడితే ఒక్కో 20 సెకన్లు కాస్తా… రెండు గంటలైపోతుంది.దీంతో మన బ్రెయిన్ కూడా అదే స్పీడ్‌కి అలవాటు పడిపోతుంది. అందుకే పుస్తకం తీసుకుని చదవాలన్నా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పని చేయాలన్నా పది నిమిషాల్లోనే బోర్ కొట్టేస్తుంది.
ఒక మంచి రీల్ చూస్తే బ్రెయిన్‌కి చిన్న కిక్ వస్తుంది. అదే ఫీలింగ్ కోసం మళ్లీ ఫోన్ తీస్తాం.”ఏమైనా కొత్త రీల్స్ వచ్చాయా?”అని తెలియకుండానే పదే పదే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటాం.ఇది నెమ్మదిగా అలవాటైపోతుంది.టైమ్ ఎక్కడ పోయిందో తెలియదు”ఇంకో రీల్ చూసి ఆపేస్తా…”అనేది ప్రతి ఒక్కరు మనసులో అనుకునే రెగ్యులర్ డైలాగ్.కానీ ఆ ఒక్క రీల్ తర్వాత మరోటి… ఇంకోటి… అలా గంట గడిచిపోతుంది. చివరికి చేయాల్సిన పని అలాగే ఉంటుంది.
రోజుకు వందల రీల్స్ చూస్తాం. కానీ సాయంత్రానికి అందులో ఐదు కూడా గుర్తుండవు.ఎందుకంటే ఒక విషయం బ్రెయిన్‌లోకి వెళ్లేలోపే ఇంకో వీడియో వచ్చేస్తుంది.అందుకే ఎక్కువసేపు రీల్స్ చూసేవాళ్లకు ఏకాగ్రత, గుర్తుంచుకునే శక్తి కాస్త తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు రెండు నిమిషాల వీడియో కూడా చాలామందికి పెద్దదిగా అనిపిస్తోంది.ఎందుకంటే రీల్స్‌కి అలవాటు పడిన బ్రెయిన్… అన్నీ వెంటనే అయిపోవాలని కోరుకుంటుంది.దీంతో చదువు, ఉద్యోగం, పరీక్షలు… ఇలా ఓపిక కావాల్సిన పనులన్నీ భారంగా అనిపిస్తాయి.
పడుకునే ముందు రీల్స్ చూడటం చాలా మందికి అలవాటే.”ఇంకో ఐదు నిమిషాలు…”అనుకుంటే అది గంట అవుతుంది. నిద్ర ఆలస్యమవుతుంది. మరుసటి రోజు లేవడం కష్టం… రోజంతా బద్ధకంగానే ఉంటుంది.
రీల్స్‌లో కనిపించేది ట్రిప్స్, లగ్జరీ కార్లు, పార్టీలు, ఖరీదైన ఫోన్లు, స్టైలిష్ లైఫ్.అవి చూస్తూ…”అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు… నా లైఫ్ మాత్రమే ఇలా ఉంది.”అని చాలామంది ఫీల్ అవుతుంటారు.కానీ నిజానికి వాళ్లు చూపించేది వాళ్ల జీవితంలో రెండు నిమిషాల హైలైట్ మాత్రమే. మిగతా వారి జీవితం ఎలా గడుస్తుందో,వాళ్లకి వాళ్ళ లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉంటాయో మనకు తెలీవు.
రీల్స్ చూడొచ్చు.. రీల్స్‌లో చాలా మంచి విషయాలు కూడా ఉంటాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. కొత్త ఐడియాలు తెలుసుకోవచ్చు. టైంపాస్ కూడా అవుతుంది.కానీ…రీల్స్‌ని మీరు కంట్రోల్ చేయాలి… రీల్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు.రోజుకి కొంత టైమ్ మాత్రమే చూడండి. మిగతా టైమ్‌లో ఫ్రెండ్స్‌తో మాట్లాడండి… ఇంట్లో వాళ్లతో కూర్చోండి… బయట కాస్త వాకింగ్ చేయండి… పుస్తకం చదవండి… ఏదైనా కొత్త పని నేర్చుకోండి.
also read :పేరు మార్చుకుంటే నిజంగానే అదృష్టం మారుతుందా?
గుర్తుపెట్టుకోండి…రీల్స్ చూడటం తప్పు కాదు… కానీ రీల్స్‌లో మునిగిపోయి మీ టైమ్, మీ ఫోకస్, మీ భవిష్యత్తునే మర్చిపోవడం మాత్రం పెద్ద తప్పు.ఇప్పటికైనా రీల్స్ ని తెగ స్కోల్ చేయకుండా లైఫ్ పై ఫోకస్ చేస్తారు కదూ!