BigTV English

Mung Bean Sprouts Benefits: బ్రేక్‌ఫాస్ట్‌లో పెసర్లు తింటున్నారా.. ఒక్క దెబ్బతో ఆ జబ్బులన్నీ పరార్!

Mung Bean Sprouts Benefits: బ్రేక్‌ఫాస్ట్‌లో పెసర్లు తింటున్నారా.. ఒక్క దెబ్బతో ఆ జబ్బులన్నీ పరార్!

Health Benefits of Mung Bean Sprouts in the Morning: ఉదయాన్నే తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌లో మంచి ఫుడ్ తీసుకుంటే అది ఆ రోజును, ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ అంటే టిఫిన్స్ కాకుండా మంచి సలాడ్స్, నట్స్, ఫ్రూట్స్ వంటివి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా పెసర్లను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మొలకెత్తిన పెసర్లను బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పెసర్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, అమైనో ఆమ్లాలు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీయోలైటిక్ అనే ఎంజైమ్స్ కూడా ఉంటాయట. రోజులో ఉండే అలసటను పొగొట్టి, ప్రశాంతంగా నిద్రపోయేలా పెసర్లు తోడ్పడుతాయట. అంతేకాదు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

మొలకెత్తిన పెసర్లలో ఐరన్ అధికంగా ఉంటుందట. శరీరంలో హిమోగ్లోబిన్ ను కూడా పెంచి, రక్తహీనత ను తగ్గిస్తుందట. మరోవైపు జీర్ణ వ్యవస్థలకు కూడా పలు రకాలుగా సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ, పుల్లటి తేన్పులు, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుందట. మొలకెత్తిన పెసర్లను తరచూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయల్ని కూడా దూరం చేసుకోవచ్చు. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మార్చుకోవచ్చు. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ ఏ కళ్లకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Also Read: Cardiophobia Symptoms : గుండెపోటు వస్తుందనే భయంగా ఉందా.. అయితే జాగ్రత్త!

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారి ఆరోగ్యానికి మొలకెత్తిన పెసర్లు చాలా మంచివి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, సంతానోత్పత్తికి కూడా ఇవి తోడ్పడతాయి. అధిక బరువుతో బాధపడేవారు అయితే వారి డైట్ లో మొలకెత్తిన పెసర్లను చేర్చుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. శరీరంలోని కొవ్వును తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

పెసర్లను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిలోని నీటిని వడపోసి ఓ బట్టలో కట్టి ఉంచడం వల్ల అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన పచ్చి పెసర్లను కూడా తినవచ్చు. లేకపోతే సలాడ్ లా తయారు చేసుకుని తీసుకోవచ్చు. అందుకోసం ఉల్లిగడ్డ, టమాటో, కీరా తురుము వేసుకుని అందులో మొలకెత్తిన పెసర్లతో పాటు, కొంచెం పెప్పర్ పౌడర్, ఉప్పు వేసుకుని తిన్నా కూడా ఆరోగ్యనికి మేలు చేస్తుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×