4 Day Work Week: కరోనా మహమ్మారి సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. చాలా నెలల పాటు ఈ విధానం కొనసాగింది. ఆ తర్వాత ‘నాలుగు రోజుల పని దినాల’ కాన్సెప్ట్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. వారానికి కేవలం 4 రోజులే పని చేయడం ఈ కాన్సెప్ట్ లక్ష్యం. పలు దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేయగా, మరొన్ని దేశాలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఇంతకీ ఈ విధానం వల్ల లాభమా? నష్టమా?
ఇప్పటికే 5 దేశాల్లో అమలు
నాలుగు పని దినాల కాన్సెప్ట్ ఇప్పటికే 5 దేశాల్లో అమలు అవుతున్నది. బెల్జియం 2022 నుంచి నాలుగు రోజుల పని దినాలను చట్టబద్ధం చేసింది. అక్కడి ఉద్యోగులు 5 రోజుల పనిని కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. UAEలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు జులై 2023 నుంచి నాలుగు రోజుల కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నారు. ఐస్ లాండ్ లోనూ నాలుగు రోజుల పని దినాలను అమలు చేస్తున్నారు. లిథువేనియా, ఫ్రాన్స్ లోనూ నాలుగు రోజుల పని విధానం అమలు అవుతోంది.
పలు దేశాల్లో ప్రయోగాలు
రీసెంట్ గా యుకెలో 4 రోజుల పని విధానంపై ట్రయల్స్ జరిగాయి. వీరిలో ట్రయల్స్ లో 92 శాతం పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సదరు కంపెనీలు తెలిపాయి. అమెరికా, ఐర్లాండ్ లోనూ ఈ ట్రయల్స్ జరిగాయి. 97 శాతం మంది కార్మికులు నాలుగు రోజుల పని దినాలకు జై కొట్టారు. స్పెయిన్, దక్షిణాఫ్రికాలోనూ ఈ విధానం పట్ల పాజిటివ్ స్పందన లభించింది. జపాన్, కెనడాలోనూ ఈ ట్రయల్స్ కొనసాగాయి. ఈ దేశాలు కూడా 4 రోజుల పని విధానానికి పాజిటివ్ గా నిర్ణయం తీసుకున్నాయి. పోర్చుగల్, బ్రెజిల్, దక్షిణ కొరియాలో ప్రస్తుతం ఈ విధానంపై ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
నాలుగు రోజుల పని దినాలతో లాభమా? నష్టమా?
నాలుగు రోజుల పని దినాలతో లాభాలు
⦿ తగ్గిన ఖర్చులు: నాలుగు రోజుల పని దినాలతో ప్రతి ఒక్కరికీ ఖర్చులు తగ్గనున్నాయి. ఆఫీస్ వారంలో మరో రోజు మూసివేయడం వల్ల నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఉద్యోగులకు కూడా రవాణా ఖర్చులు, ఫుడ్, డ్రింక్స్ ఖర్చులు తగ్గనున్నాయి.
⦿ ఉద్యోగులలో సంతోషం: నాలుగు రోజుల పని దినాల కారణంగా ఉద్యోగులు మరింత యాక్టివ్ గా ఉంటున్నారు. మిగతా రోజులు మరింత ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు.
⦿ తక్కువ ఆరోగ్య సమస్యలు: పని దినాల సంఖ్య తగ్గడం వల్ల ఉద్యోగులలో అనారోగ్య సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గినట్లు గుర్తించారు.
⦿ పెరిగిన ఉత్పాదకత: తక్కువ పని దినాల కారణంగా ఉద్యోగులు మరింత యాక్టివ్ పని చేస్తున్నట్లు గుర్తించారు. ఫలితంగా మరింత ఉత్పాదకత పెరిగినట్లు తేలింది.
⦿ నో రిక్రూట్‌మెంట్: ఉద్యోగులు ఎక్కువ యాక్టివ్ గా పని చేయడం వల్ల ఆయా కంపెనీలు అదనపు సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం రాలేదని వెల్లడించాయి. ఉన్న ఉద్యోగులు క్వాలిటీ వర్క్ చేస్తున్నట్లు తెలిపాయి.
నాలుగు రోజుల పని దినాలతో నష్టాలు
⦿ అన్ని వ్యాపారాలకు సూట్ కాదు: నాలుగు రోజుల పని విధానం అనేది అన్ని వ్యాపారాలకు అనుకూలంగా ఉండదు. అన్ని దేశాల్లో ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు.
⦿ ఎక్కువ పని గంటలు: 5 రోజుల్లో చేయాల్సిన పనిని 4 రోజుల్లోనే చేయాల్సి రావడంతో చాలా మంది ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతున్న నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నాలుగు రోజుల పని విధానం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు వెల్లడించాయి. అయితే, అన్ని కంపెనీలకు ఈ విధానం అనేది సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న వ్యాపార సంస్థలు కూడా ఓపెన్ మైండ్ గా ఆలోచించాలంటున్నారు. తమ కార్మికుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నాలుగు గంటల పని విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు.
Read Also: సిమ్మర్ డేటింగ్.. జెన్ జెడ్ ఫాలో అవుతున్న ఈ సరికొత్త ట్రెండ్ గురించి మీకు తెలుసా?