BigTV English

Covid Cases : 65 మంది మృతి.. 6 వేల కేసులు.. కరోనా కల్లోలం ఆగేదేలే!

Covid Cases : 65 మంది మృతి.. 6 వేల కేసులు.. కరోనా కల్లోలం ఆగేదేలే!

Covid Cases : ఏపీలో 86, తెలంగాణలో 10. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఇది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరల్ కంట్రోల్‌లో లేకుండా పోతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 6 వేలు దాటేసింది. ప్రస్తుతం దేశంలో 6,133 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు.. కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన మృతుల సంఖ్య 65కు చేరింది.


కేరళ టాప్

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా 1,951 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో కంగారు..

గత 24 గంటల్లో కేరళలో 144, గుజరాత్‎లో 105, పశ్చిమ బెంగాల్లో 71, ఢిల్లీలో 21 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులున్నట్లు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

హైదరాబాద్‌లో విజృంభిస్తే..?

మొదట్లో భయపడాల్సిన పని లేదన్నారు. అదేం చేయదు.. దగ్గు, జలుబు లానే సింపుల్‌గా వచ్చి పోతుందని భరోసా ఇచ్చారు. కానీ కేసులు, మరణాలు చూస్తుంటే బెదరగొట్టేలా ఉన్నాయి. కరోనా పేషెంట్లు చనిపోతున్నారు. ఒకరు ఇద్దరు కాదు ఇప్పటి వరకు ఏకంగా 65 మంది మరణించారంటే భయపడాల్సిన సమయం వచ్చినట్టేగా? ఏపీలో ప్రస్తుతం 86 యాక్టివ్ కేసులు ఉన్నాయంటే ఇదేం చిన్న నెంబర్ కాదుగా? తెలంగాణలో మొన్నటి వరకు ఒకటి, రెండు కేసులు ఉండేవి.. ఇప్పుడు డబుల్ డిజిట్ టచ్ చేసేసింది. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఒక్కసారి కరోనా విజృంభిస్తే.. ఇక కంట్రోల్ చేయడం సాధ్యమేనా? అనే ఆందోళన పెరుగుతోంది.

మాస్క్‌లు మస్ట్..

వ్యాక్సిన్లు ఉన్నాయి, హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి.. అంటూ కేంద్రం ధైర్యం చెబుతోంది. ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయిగా. ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వైరల్ అంత డేంజర్ కాదు కాబట్టి పరిస్థితి ఇంకా కంట్రోల్‌లోనే ఉంది. అదే వైరస్ మరింత ముదిరితే..? కొత్త వేరియంట్ పుట్టుకొస్తే..? భయపెట్టాలని కాదు కానీ.. జాగ్రత్తగా ఉండాలని చూసిస్తున్నారు వైద్య నిపుణులు. మనదాకా వచ్చాక చూద్దాంలే అనుకోవడానికి లేదు. ఆల్రెడీ మన వరకూ వచ్చేసింది. ఏపీలో సెంచరీ కొట్టబోతోంది. అలర్ట్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది. మాస్కులు ధరించాల్సిందే. పక్క వాళ్లు పెట్టుకోవడం లేదు కదాని మీరు లైట్ తీసుకోకండి. మాస్క్ మస్ట్‌గా పెట్టుకోండి. చేతులు తరుచూ శుభ్రం చేసుకోండి. గుంపులు గుంపులుగా తిరగకండి. కొవిడ్ ప్రికాషన్స్ పాటించండి. పరిస్థితి అదుపు తప్పే వరకూ చూడకుండా ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది అని సూచిస్తున్నారు సైంటిస్టులు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×