Woman In Suitcase| ఇంటి నుంచి బ్యాంకుకు వెళుతున్నానని చెప్పి బయలుదేరిన యువతి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఊరి చివరి కాలువ సమీపంలో ఒక సూట్ కేసులో ఆమె మృతదేహం లభించింది. ఆరాతీస్తే.. ఇదంతా రూ.5 లక్షల కోసం జరిగిన హత్య అని తేలింది. పైగా తెలిసిన వారే హంతకులు కావడం చాలా షాకింగ్. ఈ ఘటన దేశధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో త్రిలోక్ పురి ప్రాంతంలో అభిభారన్ సింగ్ అనే 69 ఏళ్ల వ్యక్తి రిటైర్మెంట్ తరువాత తన 23 ఏళ్ల కూతురితో నివసిస్తున్నాడు. ఆయన భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. ఆయనకు మొత్తం నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు వివాహం చేసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. ఇక అందరికంటే చిన్నది కూతరు నీలేష్ (23) కు మరి కొన్ని రోజుల్లోనే పెళ్లి. ఆమె ఒక రియల్ స్టేట్ ఆఫీసులో పనిచేస్తోంది. పైగా పెళ్లి తరువాత తనకు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలనే ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలో త్రిలోక్ పురిలో తన తండ్రితో కలిసి నివసిస్తున్న నీలేష్.. మే 28న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇంటి నుండి సమీపంలోని బ్యాంకుకు వివరాలు అప్డేట్ చేయడానికి వెళుతున్నానని తన తండ్రికి చెప్పింది. “మధ్యాహ్నం 1 గంటలోపు తిరిగి వస్తాను,” అని చెప్పింది. కానీ ఆమె తిరిగి రాలేదు. ఆమె కుటుంబం ఆమెను అదే చివరిసారిగా చూసిన సమయం.
రాత్రి అయినా నీలేష్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి తన ముగ్గురు కొడుకులతో తన కూతురి కోసం చాలా సేపు వెతికి మాయూర్ విహార్ ఫేస్ 1 పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆమె వెళ్లిన బ్యాంక్ వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా తనిఖీ చేశారు, కానీ ఆమె ఆచూకీ లభించలేదు.
రెండు రోజుల తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలోని సిఖెరా ప్రాంతంలో ఒక కాలువ దగ్గర సూట్‌కేస్ కనిపించింది. దానిలో ఒక యువతి కుళ్ళిపోయిన శరీరం ఉంది.
పోస్ట్‌మార్టం గుర్తింపు
హపూర్ పోలీసులు తమకు సూట్ కేసులో శవం లభించిందని చెప్పారు. “మే 30న, సిఖెరా ప్రాంతంలో సూట్‌కేస్‌లో ఒక మహిళ శవం ఉందని సమాచారం అందింది. మేము శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపాము. హత్య, ఆధారాలను కనుమరుగు చేయడం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాము,” అని హపూర్ పోలీసు అధికారి తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే నీలేష్ అదృశ్యం కేసులో దర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్ కంప్లైంట్ ద్వారా శవం నీలేష్‌దని గుర్తించారు. ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చి, శవాన్ని గుర్తించమని కోరారు. “ఆమె పసుపు రంగు దుస్తులు, తులసి పూసల మాల ఆమెను గుర్తించడానికి సహాయపడ్డాయి,” అని ఒక బంధువు చెప్పారు. పోస్ట్‌మార్టం ఆమె గొంతు బిగించి హత్య చేయబడినట్లు నిర్ధారించింది. “శరీరంపై దాడి గుర్తులు లేవు,” అని పిల్ఖువా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పట్నీష్ కుమార్ తెలిపారు. సిసిటివి వీడియోలను పరిశీలిస్తూ ఉండగా.. నీలేష్ బ్యాంకు కోసం వెళుతూ.. మధ్యలో ఒక కారులో వెళ్లిందని తెలిసింది. పోలీసులు ఆ కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు.
అనుమానితుడి అరెస్ట్, నేరం వెనుక కారణం
జూన్ 6న, ఢిల్లీలోని వినోద్ నగర్‌కు చెందిన 29 ఏళ్ల సతేంద్ర యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసేవాడు. నీలేష్‌తో మూడేళ్లకు పైగా సంబంధంలో ఉన్నాడు. అతని వద్ద నీలేష్ బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్, రెండు మొబైల్ ఫోన్‌లు, శవాన్ని పారవేయడానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో అతని కారు నంబర్ ప్లేట్ ద్వారా యాదవ్‌ను గుర్తించారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలేష్ యాదవ్‌కు 5.25 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. మే 28న ఆమె తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగింది. యాదవ్ కోపంతో ఆమె స్కార్ఫ్‌తో గొంతు బిగించి హత్య చేశాడు. అతను శవాన్ని సూట్‌కేస్‌లో ఉంచి, రాత్రి సమయంలో సిఖెరా కాలువ వద్ద పడేశాడు. ఆ కారును ఆమె ఇచ్చిన డబ్బుతో కొన్నాడు. నీలేష్ తండ్రి అభివరణ్ సింగ్ మాట్లాడుతూ.. హత్ జరిగిన రోజు యాదవ్ ను నీలేష్ అత్యవసరంగా తనకు 1 లక్ష రూపాయలు కావాలని.. అప్పుగా తీసుకున్న దాంట్లో నుంచి కనీసం ఆ మొత్తం ఇవ్వమని అడిగింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా యాదవర్ ఆమె స్కార్ఫ్ తోనే ఆమె గొంతు బిగించి చంపేశాడు. అంతకుముందు నీలేష్ కు మరో యువకుడితో సంబంధం ముందని అనుమానించి ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు.
Also Read: పురుషులను కౌగిలించికునేందుకు రూ.600 చెల్లిస్తున్న మహిళలు.. ఎక్కడంటే?
కొత్త జీవితానికి ముందు ముగిసిన జీవితం
నీలేష్ మరి కొన్ని రోజుల్లో వివాహం చేసుకోబతుండగా.. హత్యకు గురైంది. కుటుంబం ఆమె పెళ్లి సన్నాహాలు చేస్తోంది. “ఏప్రిల్ 30న ఆమె యూపీలోని ఈటా జిల్లాకు చెందిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంది,” అని ఆమె సోదరుడు చెప్పారు. జూన్ 4న హపూర్ పోలీసుల నుండి వచ్చిన ఫోన్ కాల్ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. నమ్మిన వ్యక్తే ఆమెను హత్య చేశాడు అని తన సోదరి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు.