Alasanda vadalu: సాయంత్రం కాగానే.. మనసు ఏదైనా వేడిగా, కరకరలాడే స్నాక్ కోసం వెతుకుతూ ఉంటుంది కదా! బయట ఫుడ్ తిని బోర్.. కొట్టినప్పుడు ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా అలసంద వడలు చేసేద్దాం. వీటినే కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్ల వడలు అని కూడా అంటారు.బయట క్రిస్పీగా,లోపల సాఫ్ట్‌గా ఉండే.. ఈ వడలు వేడివేడి టీ లేదా కాఫీతో తింటే.. ఆ ఫీలింగే వేరు. ప్రోటీన్ పుష్కలంగా.. ఉండే ఈ స్నాక్ ఇప్పుడు ఫిట్‌నెస్ లవర్స్‌కి కూడా ఫేవరెట్ అయిపోయింది. మరి లేట్ ఎందుకు, ఈ ట్రెండీ వడ రెసిపీ చూసేద్దాం రండీ!
అలసందల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది జస్ట్ ఒక స్నాక్ మాత్రమే కాదు, మంచి హెల్తీ ఆప్షన్ కూడా. మినప వడలతో పోలిస్తే.. అలసంద వడలు కొంచెం డిఫరెంట్ టెక్చర్‌తో, సూపర్ క్రిస్పీగా ఉంటాయి.వీటిని పర్ఫెక్ట్‌గా చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కానీ, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం రుచి అద్భుతంగా వస్తుంది. ముందుగా.. కావాల్సిన పదార్థాలు, ఆ తర్వాత తయారీ విధానం చూద్దాం.
అలసందలు (బొబ్బర్లు): 1 కప్పు (3–4 గంటలు నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2 నుంచి 3
అల్లం ముక్క: చిన్నది
కరివేపాకు: 1 రెమ్మ
కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర: అర టీస్పూన్
బియ్యప్పిండి: 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
1.ముందుగా అలసందలను బాగా కడిగి, కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు నీళ్లలో.. నాన బెట్టుకోవాలి.మీకు టైమ్ తక్కువగా ఉంటే.. గోరు వెచ్చని నీళ్లలో గంటన్నర నాన బెట్టినా సరి పోతుంది. నానిన అలసందలను నీళ్లు పూర్తిగా.. వంపేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇక్కడే.. అసలు మ్యాజిక్ ఉంటుంది. నీళ్లు ఎక్కువ పోయకుండా, పిండిని మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా.. కొంచెం బరకగా రుబ్బుకోవాలి. అలా బరకగా ఉంటేనే వడలు వేయించినప్పుడు బయట మంచి క్రిస్పీనెస్ వస్తుంది.
2.రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో.. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, కరి వేపాకు, కొత్తి మీర వేయాలి. ఇంకాస్త ఫ్లేవర్ యాడ్ చేయాలనుకుంటే.. జీల కర్రతో పాటు కొద్దిగా బియ్యప్పిండి కూడా కలుపుకోవాలి. బియ్యప్పిండి వేయడం వల్ల వడలు ఇంకా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉంటాయి.రుచికి సరిపడా ఉప్పు వేసి, ఈ మిశ్రమం మొత్తాన్ని చేత్తో బాగా కలపాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరి పడా నూనె వేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. చేతికి కొద్దిగా.. నీళ్లు లేదా నూనె రాసుకుని, పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండల్లా చేసి, అర చేతిలో పెట్టి మెల్లగా వడల్లా ఒత్తుకోవాలి. మరీ మందంగా చేస్తే.. లోపల సరిగ్గా ఉడకదు, మరీ పల్చగా చేస్తే గట్టిగా అయిపోతాయి. అందుకే.. మీడియం మందంలో ఒత్తుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది.
4.నూనెలో వడలను నెమ్మదిగా వేసి, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే.. వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే.. బయట రంగు మారి పోతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకే.. మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా వేయించడం చాలా ముఖ్యం. మంచి రంగు వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది.
Also Read: ఆకుకూర తినని వాళ్ళు కూడా..ఇష్టపడే పాలకూర పచ్చడి
5.వేడి వేడి అలసంద వడలను ప్లేట్‌లో వేసుకుని, పక్కన అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ పెట్టుకుంటే.. ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కొందరు వీటిని.. టమాటో కెచప్‌తో కూడా ఎంజాయ్ చేస్తారు. వర్షం పడే రోజుల్లో.. లేదా చల్లని సాయంత్రం వేళల్లో, ఒక కప్పు అల్లం టీతో ఈ వడలు తింటుంటే టేస్ట్ వేరేలా ఉంటుంది.
ఈ రోజుల్లో హెల్తీగా, టేస్టీగా ఉండే స్నాక్స్ కోసం చాలా మంది వెతుకుతున్నారు. బయట దొరికే.. ప్రాసెస్డ్ స్నాక్స్ కంటే ఇలా ఇంట్లోనే ఫ్రెష్‌గా అలసంద వడలు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ఫ్యామిలీతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ.. ఈ వడలు తింటే ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీరు కూడా ఈ వీకెండ్‌లో తప్పకుండా ట్రై చేసి, టేస్ట్ చేయండి!.