E-Paper
Advertisement

మటన్ కీమా మసాలా..వీకెండ్ స్పెషల్‌కి పర్ఫెక్ట్ రెసిపీ!

మటన్ కీమా మసాలా..వీకెండ్ స్పెషల్‌కి పర్ఫెక్ట్ రెసిపీ!
Advertisement

Mutton kheema masala: వీకెండ్ వచ్చిందంటే చాలు, నాన్-వెజ్ లవర్స్‌కి ఏదైనా స్పెషల్‌గా తినాలనిపిస్తుంది కదా! రోజూ చేసే చికెన్ లేదా మటన్ కర్రీ కాకుండా, ఈ సారి కాస్త డిఫరెంట్‌గా, ఘుమఘుమలాడే మటన్ కీమా మసాలా చేద్దాం. వేడి వేడి అన్నం, బగారా రైస్, చపాతీ లేదా బటర్ నాన్‌లోకి ఇది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మసాలాలు కీమాకు చక్కగా పట్టి, నోట్లో వేసుకోగానే.. కరిగిపోయేలా ఉంటే ఆ ఫీలింగే వేరు. మరి కీమా మసాలా రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందామా!

మటన్ కీమా మసాలా ప్రత్యేకత ఏంటంటే, ఇది త్వరగా ఉడికిపోతుంది. అంతే కాకుడా మసాలాలు కూడా ప్రతి ముక్కకూ బాగా పడతాయి. బిగినర్స్ కూడా.. ఈజీగా చేయగలిగే ఈ కర్రీని సరైన పద్ధతిలో చేస్తే.. గ్రేవీ చిక్కగా, టేస్టీగా వస్తుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు, ఆ తర్వాత తయారీ విధానం చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

Advertisement

మటన్ కీమా: 500 గ్రాములు

ఉల్లిపాయలు: 2 పెద్దవి

Advertisement

టమాటాలు: 2 మీడియం సైజు

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1.5 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి: 2 నుండి 3

కరివేపాకు: 1 రెమ్మ

కొత్తిమీర: కొద్దిగా

నూనె: 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు

హోల్ గరం మసాలా: బిర్యానీ ఆకు 1, లవంగాలు 3, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క

కారం: 1.5 నుండి 2 టేబుల్ స్పూన్లు (రుచికి తగ్గట్టు)

పసుపు: అర టీస్పూన్

ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్

జీలకర్ర పొడి: అర టీస్పూన్

గరం మసాలా పొడి: అర టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్లు: తగినంత

తయారీ విధానం:

1.ముందుగా స్టవ్ మీద పాన్ లేదా కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు,లవంగాలు,యాలకులు,దాల్చిన చెక్క వేసి కాస్త వేగనివ్వాలి.ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే గ్రేవీకి మంచి టేస్ట్, కలర్ వస్తాయి.

2.ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే.. వరకు కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు వేసి, అవి మెత్తగా మగ్గి నూనె.. పైకి తేలే వరకు ఉడికించాలి. టమాటోలు పూర్తిగా మగ్గిన తర్వాతే మసాలాలు వేయాలి.

3.ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మరో.. నిమిషం పాటు బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా సిమ్‌లో ఉంచి కలపడం చాలా ముఖ్యం. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న.. మటన్ కీమా వేసి, మసాలాలు మొత్తం కీమాకు పట్టేలా బాగా కలపాలి. కీమా వేసిన వెంటనే ఉండలు కట్టకుండా.. విడదీస్తూ కలుపుకుంటే సమానంగా ఉడుకుతుంది.

4.కీమాను మీడియం ఫ్లేమ్‌లో ఐదు నిమిషాలు అలానే వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా.. నీళ్లు పోసి మూత పెట్టి, కీమా మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. మటన్ క్వాలిటీని.. బట్టి ఉడకడానికి 15 నుంచి 20 నిమిషాల టైమ్ పట్టొచ్చు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ, నీళ్లు సరి పోయాయా లేదా చూసుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే.. మరికొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.

5. కీమా పూర్తిగా ఉడికి, నూనె పైకి తేలిన తర్వాత గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తి మీర వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఘుమఘుమలాడే మటన్ కీమా మసాలా రెడీ!

Also Read: ఆకుకూర తినని వాళ్ళు కూడా..ఇష్టపడే పాలకూర పచ్చడి

ఈ మటన్ కీమా మసాలాను వేడివేడి అన్నంతో తిన్నా, బగారా రైస్, చపాతీ లేదా పరోటాతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఇంకాస్త.. రిచ్‌గా కావాలనుకుంటే పైన కొద్దిగా నెయ్యి లేదా నిమ్మ రసం పిండుకుని సర్వ్ చేస్తే రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

ఈ రోజుల్లో బిజీ లైఫ్‌లో మనకు నచ్చిన ఫుడ్‌ని ఇంట్లోనే హెల్తీగా, ఫ్రెష్‌గా వండుకుని తినడం వల్ల ఆనందమే వేరు.ఈ వీకెండ్‌లో మీరు కూడా ఈ మటన్ కీమా మసాలా రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీ ఇంట్లో వాళ్లందరినీ సర్‌ప్రైజ్ చేయండి.

Related News

ఉదయం ఆఫీసుకు రెడీ అయ్యేందుకు టైమ్ సరిపోవడం లేదా? వర్కింగ్ ఉమెన్స్ కోసం టిప్స్

కరకరలాడే అలసంద వడలు..సాయంత్రం స్నాక్‌కి పర్ఫెక్ట్!

మీ చీర అందాన్ని పెంచే 5 లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్లు.. పెళ్లిళ్లకు పర్ఫెక్ట్

ఇంటి గుమ్మం తెరవగానే అందమైన లుక్ కనిపించాలా? ఈ 7 డెకరేషన్ టిప్స్‌ ట్రై చేయండి

చదువుకోవాలంటే బోర్.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు అల్లరి, ఆటపాటలంటేనే ఇష్టం

మీకు తెలుసా రావణుడి రెండో భార్య ఎవరో.. కొండలను ఎత్తగలిగే శక్తిమంతుడు ఆమె కుమారుడు

ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? కోపంలో ఈ 5 మాటలు అసలు చెప్పకండి

Big Stories

Advertisement
×