E-Paper
Advertisement

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఓ భక్తుడి అపూర్వ కానుక!

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఓ భక్తుడి అపూర్వ కానుక!
Advertisement

Tirumala Gold Donation: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు మొక్కుల రూపంలో బంగారం, నగదు సమర్పించడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే, ఇప్పుడు ఓ భక్తుడు ఏడుకొండలవాడిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఏకంగా 121 కేజీల బంగారు ఆభరణాలను కానుకగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ. 150 కోట్ల నుండి రూ. 160 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

9 సెట్లలో 45 అపురూప ఆభరణాలు

Advertisement

ఈ భారీ విరాళానికి సంబంధించి ఇప్పటికే ఆ భక్తుడు టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరిపి, అధికారిక ప్రక్రియలన్నీ పూర్తి చేశాడు. స్వామివారి అలంకరణ కోసం ప్రత్యేకంగా 9 సెట్లుగా ఉండే 45 రకాల స్వర్ణాభరణాలను అత్యంత సుందరంగా తయారు చేయించాడు. తిరుమల ఆలయ చరిత్రలోనే ఒక భక్తుడి నుంచి ఇంత భారీ స్థాయిలో కానుక రావడం ఇదే మొదటిసారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా ఇదొక ఆల్-టైమ్ రికార్డ్ అనే చెప్పాలి.

ఈ నెల 26న సీఎం సమక్షంలో అప్పగింత

Advertisement

ఈ అపురూప ఘట్టానికి ఈ నెల 26వ తేదీ వేదిక కానుంది. ఆరోజున ఆ భక్తుడు తాను చేయించిన బంగారు ఆభరణాలను తిరుమల సన్నిధిలో టీటీడీకి అందజేయనున్నాడు. మరో విశేషమేమిటంటే.. అదే రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరుమల పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. దీంతో సీఎం సమక్షంలోనే ఈ 121 కేజీల బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఎవరీ రేష్మా డాన్? బ్యూటీషియన్‌గా పనిచేస్తూ రౌడీయిజం.. చివరికి ఏమైందంటే?

Tags

Related News

ఉత్తరాంధ్ర లోకల్ ఫైట్.. బరిలో హై-ప్రొఫైల్ సతీమణులు!

కమలం, గ్లాస్, సైకిల్ గుర్తులు వేరే.. మా లక్ష్యం ఒక్కటే: ఎంపీ పురందేశ్వరి

చర్యకు ప్రతిచర్య తప్పదు.. టీడీపీ నేతలు, పోలీసులకు కేతిరెడ్డి వార్నింగ్

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!

వైసీపీది అంతా రివర్స్ వ్యవహారం.. పట్టణాలే కాదు-పల్లెల్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చారు-సీఎం చంద్రబాబు

మామ వెనక్కి తగ్గు.. అలాంటి మాటలొద్దు, బొత్సకు మేనల్లుడు శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎపిసోడ్.. అమరావతి టు ఢిల్లీ, నాకు నచ్చకపోతే అక్కడే రాజీనామా

Big Stories

Advertisement
×