E-Paper
Advertisement

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ
Advertisement

Crispy masala vada: మన తెలుగు రాష్ట్రాల్లో.. ఏ చిన్న వేడుక జరిగినా, లేదా సాయంత్రం సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటున్నా మన గుర్తుకు వచ్చే మొదటి స్నాక్ మసాలా వడ. హోటళ్లలో లేదా రోడ్డు పక్కన బండ్ల మీద వేడి వేడిగా కాలుస్తున్న మసాలా వడల వాసన వస్తుంటే.. ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. అయితే.. బయట కొనుక్కునే వాటిలో.. శుభ్రత గురించి కొన్నిసార్లు సందేహం వస్తుంది. అందుకే.. ఎలాంటి హానికారక పదార్థాలు లేకుండా.. శుభ్రంగా ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఈ వడలను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే నాలుగు నుంచి ఐదు మందికి సరి పడా వడలను తయారు చేయెచ్చు.

1. కావలసిన పదార్థాలు:

శనగపప్పు : 1 కప్పు

Advertisement

ఎండు మిర్చి: 4 లేదా 5

అల్లం, వెల్లుల్లి రెబ్బలు: కొద్దిగా

Advertisement

సోంపు : 1 టీస్పూన్

ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగినవి)

కరివేపాకు, కొత్తిమీర తరుగు: తగినంత

నూనె (ఫ్రై చేయడానికి): తగినంత

ఉప్పు,ఇంగువ: రుచికి సరిపడా

2. మసాలా వడ పర్ఫెక్ట్‌గా రావాలంటే.. శనగ పప్పు నాన బెట్టే విధానం చాలా ముఖ్యం. ముందుగా 1 కప్పు శనగ పప్పును శుభ్రంగా కడిగి, కనీసం 2 నుంచి 3 గంటల పాటు నీటిలో నాన బెట్టాలి. పప్పు బాగా నానిన తర్వాత.. నీటిని పూర్తిగా వంచేయాలి. గుర్తుంచుకోండి, నీరు అస్సలు ఉండకూడదు. ఇప్పుడు నానిన పప్పులో నుంచి సుమారు రెండు టేబుల్ స్పూన్ల పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న పప్పును వడ మిశ్రమంలో కలుపుకుంటే.. వడలు తింటున్నప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి.

3. మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, అల్లం, సోంపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మిక్సీని మరీ మెత్తటి పేస్ట్‌లా తిప్పకూడదు. పప్పు బరకబరకగా ఉండేలా.. గ్రైండ్ చేసుకోవాలి. నీరు అసలు జోడించకుండా గ్రైండ్ చేయడం చాలా ముఖ్యం.ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

4. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరి వేపాకు, కొత్తిమీర, చిటికెడు ఇంగువ వేసి చేతితో బాగా కలపాలి. ఉల్లి పాయలు వేయడం వల్ల వడలకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని, చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని గుండ్రని బాల్ లా చేసి, అర చేతిలో పెట్టి కొద్దిగా ఒత్తి వడ ఆకారంలో చేయాలి. అంచులు పగల కుండా సమానంగా ఒత్తుకోవాలి.

5. స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన.. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. తయారు చేసుకున్న.. వడలను నూనెలో జాగ్రత్తగా వదలాలి. ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే.. వరకు వేయించిన తర్వాత మరో.. వైపుకు తిప్పాలి. రెండు వైపులా చక్కటి రంగు వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుంటే.. అదనపు నూనె పీల్చేస్తుంది. వేడి వేడిగా అల్లం చట్నీ లేదా పుదీనా చట్నీతో తింటే.. ఈ మసాలా వడల రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది.

ఎలాంటి హడా విడి లేకుండా సాయంత్రం పూట వేడి వేడిగా ఇంట్లోనే.. ఈ కర కరలాడే మసాలా వడలను తయారు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి. తక్కువ ఖర్చుతో.. ఎంతో రుచి కరంగా తయారయ్యే ఈ ట్రెండీ స్నాక్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Related News

మటన్ ప్రియుల కోసం గుంటూరు స్పెషల్ గోంగూర మటన్.. తయారీ విధానం ఇదిగో!

నోరూరించే కోనసీమ పీతల పులుసు.. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు!

అచ్చమైన పల్లెటూరి రుచిలో..ఘుమఘుమలాడే ఎండుచేపల కూర!

చికెన్ లవర్స్ కోసం స్పెషల్ డిష్..రుచికరమైన వైట్ మలయ్ చికెన్ కర్రీ

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

Big Stories

Advertisement
×