E-Paper
Advertisement

చికెన్ లవర్స్ కోసం స్పెషల్ డిష్..రుచికరమైన వైట్ మలయ్ చికెన్ కర్రీ

చికెన్ లవర్స్ కోసం స్పెషల్ డిష్..రుచికరమైన వైట్ మలయ్ చికెన్ కర్రీ
Advertisement

Malai chicken recipe:  నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా, అద్భుతమైన క్రీమీ టెక్శ్చర్‌తో ఉండే మలయ్ చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. రెస్టారెంట్లలో లభించే ఈ స్పెషల్ డిష్‌ను ఇంట్లోనే చాలా ఈజీగా.. ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు, తాజా మీగడ , మసాలాల ఘుమఘుమలతో తయారయ్యే.. ఈ మలయ్ చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా చికెన్ కర్రీ అంటే కారకారంగా.. ఎర్రగా ఉండే స్పైసీ గ్రేవీ గుర్తుకొస్తుంది. కానీ.. దానికి పూర్తిగా భిన్నంగా, ఏ మాత్రం కారం లేకుండా ..మైండ్ బ్లోయింగ్ టేస్ట్‌తో ఉండే వైట్ గ్రేవీ డిష్ మలయ్ చికెన్. రోటీలు, నాన్‌లు, జీరా రైస్ లేదా పులావ్‌తో ఇది అద్భుతమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. ఇంట్లో ఏవైనా ప్రత్యేక వేడుకలు జరిగినప్పుడు లేదా వీకెండ్‌లో.. కొత్త రుచిని ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ డిష్ పర్‌ఫెక్ట్ ఛాయిస్. నాలుగు నుంచి ఐదు మందికి సరి పడా ఈ రుచికరమైన మలయ్ చికెన్ తయారీ విధానం.

కావలసిన పదార్థాలు:

Advertisement

చికెన్ (బోన్‌లెస్ లేదా విత్ బోన్): 500 గ్రాములు

పెరుగు (గడ్డ పెరుగు): అర కప్పు

Advertisement

తాజా మీగడ : 3 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్

ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి , మిరియాల పొడి: రుచికి సరిపడా

గరం మసాలా , యాలకల పొడి: అర టీస్పూన్

నెయ్యి లేదా నూనె: తగినంత

ఉప్పు, కొత్తిమీర తరుగు: తగినంత

తయారీ విధానం:

1. మలయ్ చికెన్ లోపలి.. వరకు జ్యూసీగా, సాఫ్ట్‌గా రావాలంటే.. మారినేషన్ చాలా ముఖ్యం. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో.. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గడ్డ పెరుగు, నిమ్మరసం, రుచికి సరి పడా ఉప్పు , మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు.. చికెన్‌కి బాగా పట్టి ఉడికినప్పుడు అద్భుతమైన రుచి వస్తుంది.

2. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయాలి. అందులో.. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, జీడిపప్పు వేసి ఉల్లిపాయలు రంగు మారకుండా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్ట్ వల్లనే గ్రేవీకి రిచ్ క్రీమీ టెక్శ్చర్ వస్తుంది.

3. అదే బాండీలో.. మరి కొద్దిగా నెయ్యి వేసి,మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై నీరు ఇంకిపోయే వరకు ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత ముందుగా.. సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ-జీడిపప్పు పేస్ట్ కలపాలి. పచ్చి వాసన పోయే వరకు కొన్ని నిమిషాలు ఉడికించిన తర్వాత, ఫ్రెష్ క్రీమ్ (తాజా మీగడ), కొద్దిగా పాలల్లో కలిపిన కసూరి మేతిని వేయాలి. చివరగా.. సన్నగా తరిగిన కొత్తి మీర, పచ్చి మిర్చి చీలికలతో.. గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎక్కువ కారం లేకుండా.. నోట్లో వెన్నలా కరికి పోయే రిచ్ టేస్ట్ కోరుకునే వారికి.. ఈ మలయ్ చికెన్ రెసిపీ అబ్సొల్యూట్లీ పర్‌ఫెక్ట్. రెస్టారెంట్ స్టైల్ రుచితో చికెన్ మీ ఇంట్లోనే.. తయారు చేసుకొని..మీ కుటుంబ సభ్యులతో కలిసి తినండి.

Related News

మటన్ ప్రియుల కోసం గుంటూరు స్పెషల్ గోంగూర మటన్.. తయారీ విధానం ఇదిగో!

నోరూరించే కోనసీమ పీతల పులుసు.. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు!

అచ్చమైన పల్లెటూరి రుచిలో..ఘుమఘుమలాడే ఎండుచేపల కూర!

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

Big Stories

Advertisement
×