Cupsicum: క్యాప్సికమ్ (Bell Pepper) అనేది కేవలం ఆహారం యొక్క రుచిని పెంచే కూరగాయ మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషక శక్తి కేంద్రం. వివిధ రంగులలో లభించే క్యాప్సికమ్ (ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ) ప్రతి రంగులోనూ విభిన్న పోషక విలువలు ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది ఆహార పదార్థాల తయారీలో వీటిని వాడుతుంటారు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యాప్సికమ్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికమ్‌లోని పోషకాలు:
క్యాప్సికమ్‌లో తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయి. కానీ ఫైబర్ , నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల క్యాప్సికమ్ సుమారు 20 కేలరీలను అందిస్తుంది. ఇది విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, విటమిన్ సి క్యాప్సికమ్‌లో పుష్కలంగా ఉంటుంది. ఎరుపు క్యాప్సికమ్‌లో ఆకుపచ్చ రకం కంటే 11 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్, ఒకటిన్నర రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: క్యాప్సికమ్‌లో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మం, కీళ్ల ఆరోగ్యానికి అవసరం. ఇది సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటి వాటి నుండి రక్షణ కల్పిస్తుంది.
కంటి ఆరోగ్యానికి మేలు:
క్యాప్సికమ్‌లో ఉండే లుటిన్, జియాక్సంతిన్, బీటా కెరోటిన్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా.. కంటిశుక్లం , వయస్సు సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రేచీకటి సమస్య ఉన్నవారికి కూడా ఇది సహాయపడుతుంది.
బరువు తగ్గుదల:
క్యాప్సికమ్‌లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. కొన్ని రకాల క్యాప్సికమ్‌లలో ఉండే క్యాప్సైసిన్ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి రక్షణ:
క్యాప్సికమ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: ఇవి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
రక్తహీనతను నివారిస్తుంది:
క్యాప్సికమ్‌లో ఐరన్ , విటమిన్ సి రెండూ ఉంటాయి. విటమిన్ సి శరీరంలో ఐరన్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది రక్తహీనతను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చర్మ ఆరోగ్యం:
క్యాప్సికమ్‌లోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.