BigTV English

The Raja Saab Teaser : రాజా సాబ్ టీజర్ లీక్.. నెటిజన్లను తీవ్రంగా హెచ్చరించిన మూవీ టీం!

The Raja Saab Teaser : రాజా సాబ్ టీజర్ లీక్.. నెటిజన్లను తీవ్రంగా హెచ్చరించిన మూవీ టీం!

The Raja Saab Teaser: టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). వరుస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ బిజీగా మారిన ఈయన చేతిలో ఇప్పుడు నాలుగు చిత్రాలకు పైగానే ఉన్నాయి. అందులో ఒకటి ‘ ది రాజాసాబ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మారుతి (Maruthi ) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలో విడుదలకు సిద్ధం కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి ఏకంగా టీజర్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ప్రభాస్ లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. వాస్తవానికి షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేయాలనుకున్న బృందానికి.. ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు.


ది రాజాసాబ్ టీజర్ లీక్.. చిత్ర బృందం ఫైర్..

వాస్తవానికి ఈ నెల 16వ తేదీన టీజర్ ను విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇంతలోనే టీజర్ లీక్ అవడం.. ఆ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిత్ర బృందం తాజాగా ఫైర్ అవుతూ నెటిజన్లను హెచ్చరించింది.. ఈ మేరకు ఎక్స్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ షేర్ చేస్తూ.. “ఇకపై ది రాజా సాబ్ మూవీ నుండీ లీకైన కంటెంట్ దొరికితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఎవరైతే మా కంటెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారో.. ఆ సోషల్ మీడియా హ్యాండిల్ ని కచ్చితంగా నిలిపివేస్తాము. అందరూ సహకరించి, మా కోసం నిలబడాలని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రతి మూమెంట్ ని బాధ్యతాయుతంగా జరుపుకుందాం.. ఇకపై ఇలాంటి లీకులు చేయకుండా జాగ్రత్త పడండి ” అంటూ టీం హెచ్చరిస్తూ.. ఒక ట్వీట్ షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


also read:Mrunal Thakur : దిగివచ్చిన మృణాల్ ఠాకూర్.. దెబ్బ భారీగానే పడిందే?

ది రాజాసాబ్ సినిమా విశేషాలు..

ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. కామెడీ హార్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.అంతేకాదు మొదటిసారి హార్రర్ జానర్ లోకి ప్రభాస్ అడుగుపెడుతున్నారు. పైగా ప్రభాస్ కెరియర్ లోనే పూర్తిస్థాయి హార్రర్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలవనుంది. డిసెంబర్ 5వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ధీ కుమార్ (Riddhi Kumar), నిధి అగర్వాల్ (Nidhi Agarwal)హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్(S.S.Thaman ) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కూడా ఇందులో ఒక సాంగ్లో గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి ఏకంగా రూ.350 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×