Long Hair Tips: వేడి, చెమట కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా, పొరలుగా మారుతుందా … మనమందరం ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటాం. పెరుగుతున్న వేడి, బలమైన వేడి గాలి కారణంగా.. చర్మం మాత్రమే కాకుండా జుట్టు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. అలాగే.. ఈ రోజుల్లో తలలో దురద , చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఖరీదైన ఉత్పత్తులు లేదా ప్రొడక్ట్స్ వాడటం కాదు.. అమ్మమ్మ కాలం నాటి హోం రెమెడీస్ మీ జుట్టును మెరిసేలా, మృదువుగా, ఆరోగ్యంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ జుట్టు మునుపటి కంటే అందంగా ఉండటమే కాకుండా వేగంగా పెరుగుతుంది.
ఎగ్ యార్క్ కండిషనర్:
గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్ , కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును బలపరుస్తుంది. దీనిని జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై చేస్తే.. మృదువుగా మారుతుంది. అంతే కాకుండా వేగంగా పెరుగుతుంది. దీని కోసం.. రెండు గుడ్డు సొనలను తీసుకుని శుభ్రమైన, తడి జుట్టుకు అప్లై చేయండి. సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచండి. చల్లటి నీటితో బాగా కడగండి. ఈ నివారణలు జుట్టు రాలకుండా కాపాడుతుంది. అంతే కాకేుండా ప్రోటీన్ దెబ్బతిన్న క్యూటికల్స్‌ను మరమ్మతు చేస్తుంది.
అవకాడో మాస్క్:
కొవ్వు , విటమిన్లు అధికంగా ఉండే అవకాడో జుట్టుకు గొప్ప మాయిశ్చరైజర్. దీని క్రీమీ టెక్స్చర్ చాలా బాగా కండిషనింగ్ చేస్తుంది. పండిన అవకాడోను మెత్తగా చేసి తడి జుట్టు మీద.. ముఖ్యంగా చివర్లలో రాయండి. జుట్టును షవర్ క్యాప్ తో కప్పి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత వాష్ చేయండి. ఇది మీ జుట్టును సిల్కీగా మారుస్తుంది.
తేనె, ఆలివ్ ఆయిల్:
తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు మంచి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. తేనె ఒక సహజమైన హ్యూమెక్టెంట్. ఇది తేమను నిలుపుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ ప్యాక్ తయారు చేయడానికి.. రెండింటినీ ఒక సమాన పరిమాణంలో కలిపి, జుట్టుకు అప్లై చేసి వేడి టవల్‌తో కప్పండి. తర్వాత 20 నిమిషాలు ఆగి తలస్నానం చేయండి. ఈ మిశ్రమం నిర్జీవమైన జుట్టుకు కొత్త మెరుపు, మృదువైన ఆకృతిని ఇస్తుంది.
కొబ్బరి నూనె చికిత్స:
కొబ్బరి నూనె పొడి జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. కొబ్బరి నూనె జుట్టును లోపలి నుండి పోషిస్తుంది. అంతే కాకుండా దానిని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీని యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిని మీ తలపై , జుట్టుకు పూర్తిగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయం తేలికపాటి షాంపూతో వాష్ చేయండి.
Also Read: ఈ ఫేస్ టోనర్లతో.. మీ అందం రెట్టింపు
కలబంద జెల్:
అలోవెరా జెల్ జుట్టు రాలడాన్ని నివారించే లక్షణాలను కలిగి ఉంటుంది. అలోవెరాలోని ఎంజైమ్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది క్యూటికల్స్‌ను మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా కొత్త మెరుపును అందిస్తుంది. తాజా అలోవెరా ఆకు నుండి జెల్‌ను తీసి జుట్టు, తలపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.