BigTV English

Rare Mosquito Disease: దోమల వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి.. మనమూ జాగ్రత్తగా ఉండాల్సిందేనా ?

Rare Mosquito Disease: దోమల వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి.. మనమూ జాగ్రత్తగా ఉండాల్సిందేనా ?

Rare Mosquito Disease( EEEV): యూఎస్‌ను మరో ప్రాణాంతకర వ్యాధి వణికిస్తోంది. ఈశాన్య అమెరికాలో ట్రిపుల్ ఇ వైరస్ చాపక్రింద నీరులా విస్తరిస్తోంది. దోమల కారణంగా సంక్రమించే ఈ అరుదైన వ్యాధి వల్ల అమెరికాలో ఇటీవల ఓ వ్యక్తి మరణించాడు. న్యూహాంప్ షైర్‌లోని అధికారులు మంగళవారం ఈ రోగి మరణాన్ని ధృవీకరించారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.


దోమల ద్వారా ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది ?
అధికారికంగా ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సెఫాలిటిస్ వైరస్‌గా దీనిని పిలుస్తున్నారు. దీనిని ట్రిపుల్ E అని అంటున్నారు. మొట్టమొదటి సారిగా ఈ వైరస్‌ను 1938లో మసాచుసెట్స్‌లోని గుర్రాలలో గుర్తించారు. అప్పటి నుంచి మసాచుసెట్స్ డిపార్ట్ మెంట్ డేటా ఆధారంగా ఇప్పటి వరకు 118 కేసులు నమోదవగా అందులో 64 మంది మరణించారు. ఈ వైరస్ మానవులతో దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత మొదటగా కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత మొదడు వాపుకు కారణం అవుతుంది. ఈ వైరస్ కేసులు ముఖ్యంగా యూఎస్‌లోని తూర్పు, గల్ఫ్ కోస్ట్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.

వైరస్  లక్షణాలు..


మానవుల్లో సాధారణంగా సంక్రమణ తర్వాత లక్షణాలు 10 రోజుల తర్వాత కనిపిస్తాయి.

  1. అకస్మాత్తుగా జ్వరం, చలి రావడం
  2. తీవ్రమైన తలనొప్పి
  3. వాంతులు, విరేచనాలు
  4. మూర్చ, ప్రవర్తనల్లో మార్పులు
  5. అలసటగా ఉండటం
  6. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత మెదడు వాపు

2024లో ఎన్ని కేసులు నమోదయ్యాయి ?

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా పెరుగుతున్న ఈ వైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఈ ఏడాదిలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు. అందులో.. మసాచుసెట్స్ ,న్యూ జెర్సీ, వెర్మోంట్ ,విస్కన్సిన్,  న్యూ హాంప్ షైర్ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. మసాచుసెట్స్‌లోని ఆక్స్ ఫర్డ్‌లో ఆగస్టు నెల రెండవ వారంలో 80 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకింది. 2020 తర్వాత ఇదే మొదటి కేసు అని అధికారులు వెల్లడించారు.

ఏటా సగటున ఈ వైరస్ కేసులు 11 నమోదవుతున్నాయి. 2019లో దేశ వ్యాప్తంగా మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. అందులో 12 మంది మరణించారు. మరణించిన వారిలో 30 శాతం మంది  తీవ్రమైన మెదడు వాపుతో మరణించారు. చాలా మంది మరణించే ముందు నరాల సంబంధిత సమస్యలను కూడా ఎదర్కున్నారని అధికారులు వెల్లడించారు.

అధికారులు తీసుకుంటున్న చర్యలు:

ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మసాచుసెట్స్ లోని అనేక ప్రాంతాల్లో సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు బహిరంగ ప్రదేశాల్లో అమ్మకాలను నిషేధించారు. దోమల సంచారం ఎక్కువగా ఉండే సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని ప్రజలకు సూచించారు. అంతే కాకుండా అనేక ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు క్రిమిసంహారక మందులను స్ప్రే చేస్తున్నారు. వైరస్ ల వ్యాప్తికి వాతావరణంలోని మార్పులు కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు

 

Related News

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Big Stories

×