E-Paper
Advertisement

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!
Advertisement

Gold Prices: పండుగల ముంగిట్లో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఫెస్టివల్‌ సీజన్‌లో నగలు కొనాలనుకున్న వారికి ధరాఘాతం చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో తగ్గేదే లేదంటోన్న గోల్డ్‌ రేట్‌ వినియోగదారుల హార్ట్‌ బీట్‌ పెంచుతోంది. బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో పసిడి రేట్లు ఆకాశన్నంటుతున్నాయి.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 50 వేల మార్క్‌ను టచ్‌ చేసింది. 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు లక్షా 41 వేలను క్రాస్‌ చేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో..

ధరాఘాతమే కాదు జువల్లెరీ కొంటే GST, మేకింగ్ ఛార్జీలు అదనం. రేటు ఎంత పెరిగినా పండగల టైమ్‌లో నగలతో దగదగలాడ్డమే గ్రేట్‌ కదా రేట్లు పెరిగినా సేల్స్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ముందు ముందు ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలతో చాలా మంది నగల కొనుగోలుపై ఆసక్తి చూపడంతో గోల్డ్‌ మార్కెట్‌ కళకళలాడుతోంది. హర్‌ ఏక్‌ దర్ద్‌ కో ఏకీ బామ్ అన్నట్టుగా యుద్ధం బూచి చూపి ధరలు పెంచేస్తున్నారు. ఏటీఎప్‌ ధరలను ఏకరవు పెడుతూ ఇండిగో సర్‌ చార్జ్‌లను పెంచేసింది. ఇన్‌ ద సేమ్‌ గోల్డ్‌ మార్కెట్‌లో కూడా అదే ఫార్మూలా రిఫ్లెక్ట్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్ కదలికలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వల్ల పసిడి ధరపై ప్రభావం పడుతుందంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా..

Advertisement

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్ పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గుచూపడం డాలర్, వడ్డీ రేట్లలో మార్పులు ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా రూపాయి మారకం విలువ, దిగుమతి ఖర్చులు కూడా పసిడి ధరను ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పుడు భవితకు భరోసా అని బంగారంపై పెట్టుబడి పెట్టేవాళ్లు . ఇప్పుడు గోల్డ్‌ కొనాలంటే బడ్జెట్‌ సరిపోతుందా?లేదా? అని లెక్కలేసుకోవాల్సి వస్తోంది. తులం లక్షన్నర దాటడంతో సువర్ణం సామాన్యులకు దూరం అవుతోంది. గోల్డ్‌ బాటలోనే వెండి ధరలు కూడా మండి పోతున్నాయి. కిలో వెండి ధర కూడా లక్షల రూపాయల స్థాయికి చేరింది.

Also read: హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!

Tags

Related News

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

అసలు మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ ఎందుకోసం వాడేవారో మీకు తెలుసా..?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

Big Stories

Advertisement
×