US Work Visas: వర్కింగ్ వీసాలపై అమెరికా మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డిఎస్పొసిటో చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఫారిన్ లేబర్ వీసాల విషయంలో ముందుంది బిగ్ వీక్ అంటూ ఆయన చేసిన పోస్ట్ పై పెద్ద చర్చ జరుగుతోంది.
యథా రాజా.. తథ వ్యవస్థలు అన్నట్టుగా మారింది అమెరికా పరిస్థితి. కదిపితే చాలు అమెరికన్స్ ఫస్ట్ అనే పల్లవి అందుకుంటున్నారు ట్రంప్ ఇక తానేం తక్కువ కాదన్నట్టు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ట్రంప్ మాటలకు తాళం వేస్తున్నారు. H1B వీసా ప్రక్రియను బ్రోకెన్ సిస్టమ్‌గా వర్ణించారు వాన్స్. ఛాన్స్ వస్తే H1B ప్రొగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయడానికి ఫుల్‌గా మద్దతు నిస్తానన్నారు. H1B వీసాలతో కొన్ని కంపెనీలు తక్కువ జీతానికే విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటూ అమెరికన్లను జాబ్ లెస్ చేస్తున్నారని ఆరోపించారు. వాన్స్ ప్రకటన అమెరికాలోని భారతీయులను ఉలిక్కి పడేలా చేసింది. ఆషాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే వర్కింగ్ వీసాలు టార్గెట్‌గా మరో డేంజర్ సైరన్ మోగింది.
Also read: పాప బర్త్‌డేకి డబ్బులు అడిగితే అవమానం… యజమాని కారులో కోట్ల క్యాష్… డ్రైవర్ షాకింగ్ డెసిషన్
H-1B, PERM వంటి ఎంప్లాయ్‌మెంట్ వీసా ప్రోగ్రామ్‌లను కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తోన్న లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. ప్రొటెక్ట్ అమెరికన్ వర్కర్స్ పేరిట విదేశీయుల్ని ముఖ్యంగా భారతీయుల్ని టార్గెట్ చేస్తున్నారనే చర్చ రచ్చ మొదలయ్యాయి. ఫారిన్ లేబర్ వీసాల విషయంలో ముందుంది బిగ్ వీక్ అంటూ కార్మిక శాఖ ఐజీ ఆంథోనీ డిఎస్పొసిటో ట్వీట్ చేశారు. అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్ వర్కర్స్కే అంటూ స్పష్టం చేశారు. అయితే ఏ వీసాలపై చర్యలు తీసుకోబోతున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అమెరికా టెక్ రంగంలో భారతీయుల సంఖ్య భారీగా ఉండటంతో. H-1B, ఇతర వర్కింగ్ వీసాలపై ఆధారపడిన భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే H-1Bని రద్దు చేస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
విదేశీ ఉద్యోగులపై నిషేధం కాదు. వీసా వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడ్డమే అమెరికా లక్ష్యమన్నది ఆంధోని ట్వీట్ వెనక అసలు అర్ధం. కానీ అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే నినాదంతో ట్రంప్ ఎలాంటి విధానాలను తెరపైకి తెస్తుందనేది చాలా మందిలో ఆందోళన కల్గిస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Also read: హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధుడే లక్ష్యంగా హనీట్రాప్.. రూ.38 లక్షలు కాజేసిన కేటుగాడు!