BigTV English

Heart attack in Sleep: నిద్రలో కూడా గుండెపోటు వస్తుందని తెలుసా? అలా రాకుండా ఇలా జాగ్రత్త పడండి

Heart attack in Sleep: నిద్రలో కూడా గుండెపోటు వస్తుందని తెలుసా? అలా రాకుండా ఇలా జాగ్రత్త పడండి

గుండెపోటు ఇప్పుడు ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే గుండె సమస్యలు వచ్చేవి. కానీ ఆధునిక కాలంలో ఒత్తిడి కారణంగా యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. కొన్నిసార్లు గుండెపోటు నిద్రలో కూడా వస్తుంది. నిద్రలో వచ్చిన గుండెపోటును అడ్డుకోవడం, వెంటనే చికిత్స అందించడం చాలా కష్టం. కాబట్టి గుండెపోటు నిద్రలో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.


గుండెపోటుకు నిద్రకు మధ్య సంబంధం ఏమిటి?
శరీరం విశ్రాంతి తీసుకునే సమయం నిద్ర. అయితే నిద్రపోయినప్పుడు శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయడం ఆపేయదు. అలా పని చేస్తూనే ఉంటాయి. మీరు నిద్రపోతున్నప్పుడు రక్తపోటు, హృదయ స్పందన రేటు సాధారణంగా కాస్త నెమ్మదిగా ఉంటాయి. కానీ కొన్ని సార్లు గుండె నిద్ర సమయంలో ఎక్కువగా కష్టపడి పని చేయాల్సి వస్తుంది. అధిక రక్తపోటు ఉన్న వారిలో క్రమరహిత గుండె లయ సమస్య ఉన్నవారిలో, అలాగే ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతల వల్ల కూడా గుండెపోటు రావచ్చు. ఇది నిద్రలో శ్వాస తీసుకోవడానికి అంతరాయాన్ని కలిగిస్తుంది. అప్పుడు గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది గుండెపోటుకు కారణం అవుతుంది.

లోతు శ్వాసగా తీసుకోవాలి
పడుకునే ముందు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం చేయాలి. ఇది మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే హృదయ స్పందన రేటును కూడా తగ్గిస్తుంది. దీన్ని ప్రతిరోజూ చేయడం వల్ల రక్తపోటు మందగిస్తుంది. గుండెకు ఆక్సిజన్ ప్రవాహం కూడా మెరుగుపడుతుంది. అలాంటప్పుడు నిద్ర బాగా పడుతుంది. అలాగే నిద్రలో గుండెపోటు కారణమయ్యే పరిస్థితులు కూడా తగ్గుతాయి. క్రమం తప్పకుండా లోతైన శ్వాస తీసుకోవడం వల్ల నిద్రలో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.


నిద్రపోయే ముందు లోతైన శ్వాసను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. పొట్ట నుండి నెమ్మదిగా లోతైన శ్వాసను తీసుకోవాలి. నాలుగు సెకండ్ల పాటు గాలిని పిలిచి, ఏడు సెకన్ల పాటు బిగబట్టి ఉంచాలి. ఆ తర్వాత ఎనిమిది సెకన్ల పాటు గాలిని వదలాలి. ఇది ప్రతిరోజు సాధన చేస్తే మంచిది.

కేవలం లోతైన శ్వాస వ్యాయామాల ద్వారా గుండెపోటును అడ్డుకోలేరు. ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. గుండె సమస్యలు నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, ఉప్పు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది.

ఏం తినాలి?
ప్రతిరోజు మీరు తినే ఆహారం ఇంద్రధనస్సులా ఉండాలి. అంటే రంగురంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. బియ్యం, పాస్తా వంటి వాటికి బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తినేందుకు ప్రయత్నించండి. నట్స్, సీడ్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోండి. మంచి కొవ్వు లభించే సాల్మన్ చేపలను తినండి. వేయించిన ఆహారాలు ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలను కూడా తక్కువగా తినడం మంచిది. ముఖ్యంగా బీపీని అదుపులో ఉంచుకోండి.

ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఇలా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు కూడా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. వారంలో కనీసం 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్, ఈతా వంటివి ఉండేలా చూసుకోండి.

డయాబెటిస్ రోగులు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే గుండెపోటుకు ప్రధానమైన ప్రమాదకరకాలు అధిక రక్తపోటు, మధుమేహం. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వెంటనే వదిలేయండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×