BigTV English

Ace OTT : ఓటీటీలోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చేసిన విజయ్ సేతుపతి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Ace OTT : ఓటీటీలోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చేసిన విజయ్ సేతుపతి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Ace OTT : తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. తెలుగులో ఈయన పలు సినిమాలు చేశారు. ఈ మధ్య ప్రత్యేక పాత్రలు చెయ్యడంతో పాటుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలలో ‘ఏస్‌’ ఒకటి. గత నెల 23 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కు రావడం విశేషం. రుక్మిణి వసంత్‌ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీగా ఆకట్టుకున్న ఈ మూవీని ఆర్ముగ కుమార్‌ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్‌, పృథ్వీరాజ్‌, కీలక పాత్రలలో నటించారు.. స్టోరీ, స్ట్రీమింగ్ వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..


స్టోరీ విషయానికొస్తే.. 

ఏస్ మూవీలో జైలు నుంచి విడుదలైన బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం ఆశ్రయం కల్పిస్తాడు.. మలేషియాలో కల్పన హోటల్‌ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు. ఇంటి కోసం కష్టపడుతున్న రుక్మిణి ప్రేమలో పడతాడు. తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు.. మలేషియాలో వడ్డీకి డబ్బులు ఇచ్చే ధర్మ వద్దకు వెళ్తారు. అక్కడ అతని కూరత్వం తెలియక ఉచ్చులో పడతారు. అతని నుంచి ఎలా బయట పడతారు.. ఆ గండం గట్టేక్కగానే మరొక తలనొప్పి కన్నన్ కు ఎదురవుతుంది. బ్యాంక్ రాబరిలో ఇరుక్కుంటాడు. వీటన్నిటి నుంచి ఎలా బయట పడ్డాడు. చివరికి రుక్మిణి పెళ్లి చేసుకున్నాడా? లేదా అతని జైలు చరిత్ర తెలిసిపోయిందా అన్నది ఇప్పుడు తెలియాలంటే స్టోరీని చూసేయ్యాల్సిందే.. డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. గతంలో వచ్చిన మహారాజ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది. థియేటర్లలో యావరేజ్ గా ఆడిన ఈ ఏస్ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.


Also Read :ఓటీటీల్లోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు.. ఆ 7 సినిమాలు మస్ట్ వాచ్..

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ( Amazon Prime ).. 

ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు రిలీజ్ కు ముందే డీల్ ఫిక్స్ చేసుకుంది. అయితే థియేటర్లలో మూవీ ఎక్కువ రోజులు రన్ అవ్వలేదు. దాంతో మూడు వారాల్లోనే మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నేటి నుంచి మూవీ అందుబాటులోకి వచ్చేసింది. ఇదే కాదు ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. మీకు నచ్చిన మూవీని మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.. మరోవైపు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏ మూవీ బ్లాక్ బాస్టర్ అందుకుంటుందో చూడాలి..

Related News

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

Big Stories

×