వేసవిలో కచ్చితంగా కారులో ప్రయాణం చేసేవారే ఎక్కువ. ఎందుకంటే ఎండ ధాటికి తట్టుకోలేక కారు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే కారులో ఒక నీళ్ల బాటిల్ పెట్టి గంటలకు కొద్ది కారులోనే ఉంచి తాగుతూ ఉంటారు. వేసవిలో పరిస్థితులను బట్టి మన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే ఆహారాన్ని నిల్వ కూడా చేయాలి.
వేసవిలో పరిస్థితిలో మారుతూ ఉంటాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్లాస్టిక్ నుండి రసాయనాలను నీటిలోకి లీక్ చేస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు వేసి కార్లో వదిలేస్తే అది వేడెక్కుతూ ఉంటుంది. ఆ వేడికి ప్లాస్టిక్ లో ఉన్న సూక్ష్మకణాలు నీటిలోకి విడుదలవుతూ ఉంటాయి. దీనివల్ల నీటి రుచి, నాణ్యత కూడా మారిపోతుంది. కారులో ఉంచిన నీటిని తాగడం వల్ల సమస్య ఉండదు. కానీ ఏసీ లేని కారులో వేడెక్కిన ప్లాస్టిక్ బాటిల్ లోని నీరు తాగడం మాత్రం మంచి పద్ధతి కాదు.
రీసెర్చ్ గేట్లో ప్రచరితమైన ఒక అధ్యయనం ప్రకారం అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నిల్వచేసిన నీళ్లను తాగడం ఏమాత్రం మంచిది కాదు. ఆ బాటిల్ నుంచి బిపిఏ, థాలేట్ వంటి హానికరమైన రసాయనాలు నీటిలోకి లీక్ అవుతూ ఉంటాయి. దీనివల్ల నీటి పీహెచ్ లో మార్పులు వస్తాయి. ఫ్లోరైడ్, క్లోరైడ్ స్థాయిలు పెరిగిపోతాయి. అలాంటి నీటిని తాగడం వల్ల హార్మోన్లకు అసమతుల్యతకు ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు వేడికి గురి అయిన నీటిలో బ్యాక్టీరియా పెరుగుదల కూడా వేగంగానే జరుగుతుంది.
వేసవిలో ఏసీ లేని కారులో వేడి త్వరగానే పెరుగుతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కారులో ఉంచినప్పుడు అది కూడా ప్రభావితం అవుతుంది. ప్లాస్టిక్ బాటిల్ లో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా తయారు చేయరు. వేడి వల్ల ప్లాస్టిక్ నీటిలోకి హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. ఆ రసాయనాలు మీరు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
వాటిలో ఉన్న నీరు వేడిని తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రతలలో ఆ బాటిల్‌ని ఉంచినప్పుడు బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బాటిల్ మూత తెరిచి ఉంటే అందులో చిన్న సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయి. ఎండలో ఉంచిన బాటిల్ నుండి తాగే ముందు జాగ్రత్త పడండి. వీలైనంతవరకు చల్లని బాటిల్ ని కొనుక్కోవడం మంచిది. లేదా ప్లాస్టిక్ బాటిల్ ను వాడడం మానేసి ఇంటి దగ్గర నుంచి స్టీల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవడం ఉత్తమం.
మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ బాటిల్ బాగా వేడెక్కాక అన్నిటిని తాగి చూడండి. కచ్చితంగా మీకు ఒక వింతైన రుచి అనిపిస్తుంది. నీరు పాతబడినట్టు కూడా తెలుస్తుంది. ఇది ప్లాస్టిక్ రుచి వల్ల కలిగే మార్పు. ఒక్కసారి తాగితేనే సమస్య వస్తుందా అంటే పదే పదే తాగే వారు ఎంతో మంది ఉన్నారు. వేడి చేసిన ప్లాస్టిక్ నుండి వచ్చే రసాయనాలు మీ శరీరంలో పేరుకుపోతూ ఉంటాయి. ఆ రసాయనాలు శరీరంలో ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతాయి. అందుకే స్టీలు లేదా గాజుతో తయారు చేసిన సీసాలను ఉపయోగించడం మంచిది. ఇవి హానికరమైన రసాయనాలను లీక్ చేయవు. అలాగే కారులో బాటిల్ ని వదిలివేసే కన్నా సీటు కింద లేదా దుస్తుల మధ్య మడతపెట్టిన దుస్తుల మధ్య ఉంచడం వల్ల అది నేరుగా వేడికి ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాదు.