BigTV English

NTRNEEL : నెవర్ బిఫోర్ భారీ యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్

NTRNEEL : నెవర్ బిఫోర్ భారీ యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్

NTRNEEL : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు. కే జి ఎఫ్ సినిమాలోని పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించాడు. మనిషి చూడడానికి చాలా క్లాసు గా కనిపించినా కూడా ఎంతో వైలెంట్ ను సినిమాలో ప్రజెంట్ చేశాడు. కేవలం వైలెంట్ మాత్రమే ప్రజెంట్ చేయలేదు దాంతోపాటు అద్భుతమైన మదర్ ఎమోషన్ పట్టుకోగలిగాడు. ఎమోషన్ సినిమాకి ఆయువుపట్టుల ఉంది. అసలు కేజీఎఫ్ సినిమాని ప్రశాంత్ డిజైన్ చేసిన విధానం చాలా మందికి ఒక విజువల్ ట్రీట్ లా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ ఆ సినిమా చూసి సర్ప్రైజ్ అయిపోయారు. ప్రతి సీన్ ని ఎలివేట్ చేసిన విధానం చాలామంది విపరీతంగా కనెక్ట్ అయింది. ఒక కేజీఎఫ్ 2 సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అంత భారీ సినిమాలో చేసిన తర్వాత తెలుగు స్టార్ హీరోల వైపు మొగ్గు చూపాడు ప్రశాంత్.


ప్రభాస్ కం బ్యాక్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ తరువాత ఏ సినిమా చేసినా కూడా అంతటి విజయాన్ని సాధించలేకపోయింది. ప్రభాస్ ఎప్పుడు కం బ్యాక్ ఇస్తాడా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురు చూశారు. అలాంటి వాళ్లందరికీ సలార్ సినిమాతో ఒక విజువల్ ట్రీట్ అందించాడు ప్రశాంత్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రశాంత్ ఇదివరకే చేసిన ఉగ్రం సినిమాని మరోసారి సలార్ గా మార్చాడు. ఈసారి భారీ కాస్ట్ అండ్ క్రూ తో ఆ సినిమాను తెరకెక్కించాడు. అతి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్ట గలిగాడు.


భారీ యాక్షన్ ప్లానింగ్

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్ అని టైటిల్ ఖరారు చేశారు. దీనిని అధికారికంగా ప్రకటించక పోయినా కూడా, ఎస్.ఎస్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో రివిల్ చేసేశారు. త్వరలో ఈ టైటిల్ గురించి అధికార ప్రతి ప్రకటన చేయనున్నారు.ఇకపోతే ఈనెల 22 నుంచి ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. మే 15 వ‌ర‌కూ ఈ షూటింగ్ కొన‌సాగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడు ప్ర‌శాంత్ నీల్. ఈ ఫైట్ సినిమా మొత్తానికికే హైలెట్ కాబోతోంది. మామూలుగా ప్రశాంత్ ఫైట్స్ ని ఎలా డిజైన్ చేస్తాడు అందరికీ తెలిసిన విషయమే. ఇది సినిమాకి హైలెట్ కాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా ఒక మాస్ విజువల్ ట్రీట్ ప్రశాంత్ ఇవ్వనున్నాడు అని చెప్పొచ్చు.

Also Read : Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందేమో

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×