BigTV English
Advertisement

Balayya: అఖండ 2 తర్వాతి సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి…

Balayya: అఖండ 2 తర్వాతి సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి…

Balayya: జాట్ సినిమా కథ ముందు నందమూరి బాలకృష్ణకి చెప్పాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. “ఓ రోజు జరగే కథ కాదు… ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే కథ కావాలి” అని బాలయ్య అడగడంతో ‘వీరసింహారెడ్డి’ తెరపైకి వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా, చాలా కాలం తర్వాత నందమూరి అభిమానుల పూనకాలు తెప్పించింది. ఈ మూవీలో బాలయ్య గెటప్ కే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎలివేషన్ సీన్స్ ని గోపీచంద్ మలినేని పీక్ స్టేజ్ లో ఇచ్చాడు. దీంతో సీడెడ్ ఏరియాలో వీర సింహా రెడ్డి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది, బాలయ్య ఫ్యాన్స్ కి గోపీచంద్ మలినేని ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు.


ఇప్పుడు జాట్ నార్త్ బెల్ట్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతుంద, ఇదే మూవీ బాలయ్య చేసి ఉంటే, “పాన్ ఇండియ సారీ బోల్” అనే డైలాగ్ తో మోత మోగిపోయేది. కానీ అది మిస్ అయ్యింది. ఆ అవకాశం మిస్ అయినా, ఈసారి మాత్రం పాన్ ఇండియా టార్గెట్ అంటూ మళ్లీ బాలయ్య-గోపిచంద్ మలినేని కాంబినేషన్ సెట్ అయ్యింది.

ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ స్టఫ్ కాదు, కమాన్ ఆడియన్స్ కి కూడా పూనకాలు తెప్పించే క‌థతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు హీరో-డైరెక్టర్. బాలయ్యకి హార్డ్‌కోర్ ఫ్యాన్ అయిన గోపిచంద్ మలినేని, అభిమానులు బాలయ్యను ఎలా చూడాలనుకుంటారో బాగా అర్థం చేసుకున్నాడు. ఆ కారణంగా ‘వీరసింహారెడ్డి’లో ఆయనను ఓ మాస్ గాడ్‌లా చూపించి పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు ‘అఖండ 2’ తర్వాత వచ్చే బాలయ్య సినిమా ఇది కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకడం గ్యారెంటీ.


ఆ అంచనాలను గోపిచంద్ మలినేని ఎటువంటి కథతో అందుకోబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మేకింగ్, స్క్రీన్ ప్లేతో బాలయ్యతో సెకండ్ హిట్ కొట్టడానికి గోపీచంద్ మలినేని రెడీ అయ్యాడు. ఈ కొత్త ప్రాజెక్ట్ జూన్ 10న, బాలయ్య బర్త్‌డే రోజున గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. ఆ రోజు ఫ్యాన్స్ కోసం గోపి మలినేని ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా? ఏదైనా డార్లింగ్ డైలాగ్, టీజర్ గ్లిమ్ప్స్ ఉంటుందా? అన్నది అప్పుడు తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈసారి కథే హీరో… ఆ కథలో బాలయ్య మాస్ మానిఫెస్టేషన్ ఉండనుంది. మరి ఈ కాంబో మళ్లీ ఎలాంటి మోత మోగిస్తుందో చూడాలి!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×