BigTV English

Fennel Seeds: భోజనం చేశాక సోంపు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా..

Fennel Seeds: భోజనం చేశాక సోంపు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా..

Fennel Seeds: భోజనం చేసే సమయంలో చాలా రకాల పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. భోజనంలో భాగంగా కూరలు, అప్పడాలు, సాంబార్, స్వీట్స్, బజ్జీలు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా భోజనం చేసే సమయంలో చాలా రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అయితే ఇది ఉదయం, మధ్యాహ్నం వేళ కాకుండా రాత్రి వేళ ఇలాంటి ఆహారపు పదార్థాలు తీసుకుంటే వెంటనే సోంపు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా రకాల కడుపు సంబంధింత సమస్యలను తొలగిస్తుంది.


తరచూ భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తీసుకునే అలవాటు ఉంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా రాత్రి వేళ మాత్రమే కాకుండా కొంతమందికి ఉదయం పూట సోంపును నీటిలో నానబెట్టి తినే అలవాటు కూడా ఉంటుంది. సోంపును ఏ విధంగా అయినా సరే తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సోంపు గింజల మాదిరిగా లేదా సోంపు నీటిని తీసుకుంటే జీర్ణ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల్లో ఉండే అజీర్ణం, గ్యాస్, మంట, ఉబ్బరం వంటి చాలా రకాల సమస్యలను సోంపు తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు.

నోటి దుర్వాసనతో బాధపడే వారు సోంపు గింజలను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతీ రోజూ సోంపును తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. సోంపు గింజల్లో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల నోటి చిగుళ్ల సమస్య, దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరోవైపు సోంపు గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఫ్రీ రాడికల్స్ వంటి వాటితో పోరాడి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఉదయాన్నే వీటిని తీసుకుంటే వికారం, వాంతులు, తిరగడం, అలసట, నీరసం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.


దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా సోంపు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గర్భిణీ మహిళలు కూడా సోంపుతో టీ తయారుచేసుకుని తాగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సోంపును నీటిలో నానబెట్టుకుని తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. అంతేకాదు మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు తరచూ సోంపు నీటిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. భోజనం తర్వాత అయినా సరే సోంపు నమలడం ద్వారా జీర్ణ సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. సోంపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని మంట, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×