Health Benefits of Ghee Soaked Dates: ఖర్జూరతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఖర్జూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరలో ఉండే ఫైబర్, ఐరన్, చక్కెరలు, త్వరగా శక్తిని ఇస్తాయి. అంతేకాదు శరీరంలోని కొలస్ట్రాల్, రక్తపోటువంటి సమస్యలను కూడా నివారిస్తుంది. మరోవైపు జీవశక్తిని పెంచడంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఖర్జూరలో ఉండే పోషకాలు ఒక టానిక్ లా పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లోని మిగతా వాటితో పోల్చితే ఖర్జూరలో ఎనర్జీ పోషకాలు, క్యాలరీలు అధికంగా ఉంటాయి.
ఖర్జూర ఓ విలువైన ఔషధం. రోగనిరోధఖ శక్తి, సమతుల్యత మానసిక స్థితి, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి వంటి కణజాలాలను రిపేర్ చేసేందుకు కూడా తోడ్పడతాయి. అయితే నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచేందుకు కూడా ఖర్జూర తోడ్పడుతుంది. మంచి నిద్రకు కూడా ఖర్జూర సహకరిస్తుంది. ఖర్జూరలో నెయ్యిలో నానబెట్టుకుని తినడం వల్ల కొవ్వులతో కలిసి శక్తిని అందిస్తాయి. గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఖర్జూరలో ఉండే ఫైబర్ శక్తిని పెంచేందుకు సహకరిస్తుంది.
నెయ్యిలో అనేక విలువైన పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి, మలబద్ధకాన్ని దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. నెయ్యిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సహా కొవ్వులు కూడా ఆరోగ్యానికి తోడ్పడతాయి.
Also Read: Chia Seeds For Glowing Skin: చియా సీడ్స్‌తో గ్లాస్ స్కిన్.. ఎలా వాడాలో తెలుసా మరి..?
బి కాంప్లెక్స్, విటమిన్ కె, ఏ, డైటరీ ఫైబర్, పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం వంటివి ఎన్నో రకాల పోషకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా తోడ్పడతాయి. అంతేకాదు ఇవి రక్తపోటు, రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇలా పోషకాలు ఉన్న ఖర్జూరను నెయ్యిలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు ఉంటాయి.