E-Paper
Advertisement

Virat Kohli: కోహ్లీ-అనుష్క‌ల‌కు ఇంత బలుపా..? ఓ స్వామిజీకి ఉన్న విలువ‌, ఓ వికలాంగుడికి లేదా !

Virat Kohli: కోహ్లీ-అనుష్క‌ల‌కు ఇంత బలుపా..? ఓ స్వామిజీకి ఉన్న విలువ‌, ఓ వికలాంగుడికి లేదా !
Advertisement

Virat Kohli:  టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20లు అలాగే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నాడు. అటు ఐపిఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. లండన్ లో సెటిల్ అయిన విరాట్ కోహ్లీ దంపతులు, మ్యాచ్ లు ఉన్న సమయంలో మాత్రమే ఇండియాకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో వన్డే సిరీస్ లో భాగంగా ఇండియాకు వచ్చింది విరాట్ కోహ్లీ ఫ్యామిలీ. అయితే, ఇండియాలో ప్రముఖ పట్టణాలు తిరుగుతున్న విరాట్ కోహ్లీ దంపతులు తాజాగా శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్ర‌మానికి వెళ్లారు. అనంత‌రం ముంబైకి చేరుకున్నారు. ఈ త‌రుణంలోనే కోహ్లీ దంప‌తులు వివాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ కారణంగా విరాట్ కోహ్లీ దంపతులు కాంట్రవర్సీని ఎదుర్కొంటున్నారు.

Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే

వివాదంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరు ముంబైలోని విమానాశ్రయంలో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ దంపతులతో సెల్ఫీలు దిగేందుకు చాలా మంది ఎగబడ్డారు. వాళ్లందరిని తప్పించుకొని కారు దాకా కోహ్లీ దంపతులు వచ్చారు. అయితే, తన కారు వద్ద ఓ వికలాంగుడు సెల్ఫీ అంటూ ఎదురుపడ్డాడు. అయితే అతన్ని పట్టించుకోని విరాట్ కోహ్లీ దంపతులు కారు ఎక్కి, అక్కడి నుంచి చెక్కేశారు. అటు అడ్డుగా వచ్చిన వికలాంగుడిని, విరాట్ కోహ్లీ సెక్యూరిటీ తోసేసింది. దీంతో అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక‌లాంగుడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. స్టార్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ దంపతులకు ఇంత బలుపు ఎందుకు ? అంటూ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీకి అంటే ముందు నుంచే పొగ‌రు ఉంది, మ‌రీ అనుష్క శ‌ర్మ అయినా సెల్ఫీ దిగేందుకు అవ‌కాశం ఇస్తే బాగుండు అంటూ సూచ‌న‌లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న విక‌లాంగుల‌కు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిదేన‌ని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ఈ వివాదంపై ఇప్ప‌టి వ‌ర‌కు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు స్పందించ‌లేదు.

శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్ర‌మానికి కోహ్లీ ఫ్యామిలీ

ఇండియాలో పర్యటించిన ప్రతిసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు విరాట్ కోహ్లీ దంపతులు. ఏడాది మే 13వ తేదీన ఆశ్రమానికి వెళ్లిన విరాట్ కోహ్లీ దంపతులు, డిసెంబర్ 16 అంటే నిన్నటి రోజున కూడా స్వామీజీని కలిశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేందుకుగాను తరచూ ఈ ఆశ్రమానికి విరాట్ కోహ్లీ దంపతులు వెళ్తారు.

Advertisement

Also Read: IPL Auction 2026: మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయ‌ర్లు వీళ్లే

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×