BigTV English

Winter: మన శరీరంలో ఏ భాగానికి చలి ఎక్కువగా వేస్తుందో తెలుసా?

Winter: మన శరీరంలో ఏ భాగానికి చలి ఎక్కువగా వేస్తుందో తెలుసా?

చలికాలం వచ్చేసింది. వణికించే చల్లదనం వాతావరణంలో నిండిపోయింది. సాయంత్రం అయితే చాలు… తలుపులు, కిటికీలు వేసి ఇంటిని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎంతోమందికి జలుబు, వైరల్ ఫీవర్లు వంటివి ఎన్నో వచ్చేస్తున్నాయి. చల్లదనానికి మన శరీరం తట్టుకోలేదు. అయితే చలికాలం రాగానే లేదా చలి వాతావరణంలో మొదటిగా ప్రభావితం అయ్యే శరీర భాగాలు కాళ్లు, చేతులు. ఎందుకంటే శరీరానికి చిట్ట చివరన ఉండేది కాళ్లు, చేతులే. ఈ భాగంలో రక్తప్రసరణ మిగతా అవయవాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దీనివల్లే కాళ్లు, చేతులు త్వరగా చల్లగా అయిపోతాయి. అంతేకాదు చేతిలో, కాళ్లలో ఉండే చర్మం మందంగా ఉంటుంది. చర్మం భాగం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తప్రసరణ ఇక్కడ తక్కువగా జరుగుతుంది. అందుకే చేతులు మొదట చల్లగా మారిపోతాయి. పాదాలు కూడా చల్లగా అనిపిస్తాయి.


స్త్రీలకే చలి ఎక్కువ
పురుషులకంటే స్త్రీలకే ఎక్కువగా చలి ఉంటుంది. ఎందుకంటే స్త్రీలలో వేడిని ఉత్పత్తి చేసే కండరాలు తక్కువగా ఉంటాయి. వీరి శరీరం మృదులాస్తి కణజాలంతో ఎక్కువగా తయారుచేసి ఉంటుంది. పురుషుల్లో మాత్రం వేడిని ఉత్పత్తి చేసే కండరాలు అధికంగా ఉంటాయి. వారికి మహిళలతో పోలిస్తే చలి తక్కువగా ఉంటుంది. స్త్రీ శరీర నిర్మాణం కూడా చలి ఎక్కువగా వేయడానికి కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ సమస్యలున్నా తట్టుకోలేరు


అలాగే స్త్రీ పురుషుల్లో ఎవరికైనా రక్తహీనత సమస్య ఉన్నా, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్నా, కొన్ని రకాల పోషకాహార లోపాలు ఉన్నా కూడా వారికి చలి ఎక్కువగా వేస్తుంది. వారు ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులను భరించలేరు. ఉష్ణోగ్రతలో కలిగే హెచ్చుతగ్గులను గ్రహించడానికి, తిరిగి ప్రతిస్పందించడానికి వారి శరీరం ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. చర్మంలోని నరాలు ఉష్ణోగ్రతల్లో మార్పులను గుర్తించి మెదడుకు సమాచారాన్ని పంపుతాయి. అప్పుడే మనకి చలి అనే పరిస్థితి తెలుస్తుంది.

వీటికే చలి ఎక్కువ

అలాగే మన శరీరంలో ముక్కు, చెవులు కూడా త్వరగా చల్లగా మారిపోతాయి. ఎందుకంటే ఈ అవయవాలు శరీరం లోపలికి తెరిచి ఉండే ద్వారాల్లా ఉంటాయి. వీటి ఉష్ణోగ్రతతో ప్రత్యేక సంబంధం కలిగి ఉంటుంది. ముక్కు ద్వారా చల్లని గాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ముక్కు త్వరగా చల్లగా మారిపోతుంది. చలికాలంలో పిల్లలు, వృద్దులు కూడా చలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి కారణం వారి శరీర ఆకృతి, శక్తి, సమర్థత అని కూడా చెప్పుకోవచ్చు. శరీరం పనిచేసే సమర్థతపై కూడా చలిని తట్టుకొనే శక్తి ఆధారపడి ఉంటుంది. శరీరం వెలుపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు శరీరం లోపల ఉన్న అవయవాలకు రక్త ప్రవాహం సరిగా జరిగేలా చూసుకోవాలి. శరీరంలోని అవయవాలపై చలి ప్రభావం తగ్గేలా శరీరం ప్రతిస్పందించాలి. అందుకే ఆరోగ్యంగా ఉన్న వారిలోనే ఇలాంటి ప్రతిస్పందనలు సరిగ్గా ఉంటాయి. అప్పుడే వారికి చలి అధికంగా వేయదు. కానీ ఎవరైతే కొన్ని రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారో, పోషకాహార లోపం ఉంటారో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో… వీరంతా కూడా త్వరగా చలి బారిన పడతారు.

వ్యాయామం చెయ్యాల్సిందే

చలికాలంలో వ్యాయామం చేసే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. చల్లగాలులకు భయపడి వ్యాయామం చేయరు. నడక వంటి వాటికి కూడా వెళ్ళరు. వీటి వల్ల కూడా వారికి విపరీతమైన చలిగా అనిపించే అవకాశం ఉంది. వ్యాయామం, నడక తరచూ చేసేవారిలో చలిని తట్టుకునే శక్తి వస్తుంది. దీనివల్ల వారికి చల్లని వాతావరణంలో కూడా తట్టుకొని కొన్ని గంటల పాటు ఉండగలరు. ఎప్పుడైతే ఎలాంటి వ్యాయామం చేయరో వారు చలి బారిన త్వరగా పడతారు. వారి చేతిలో కాళ్లు త్వరగా చల్లబడిపోతాయి.

Also Read: చలికాలంలో నువ్వులు తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

నీళ్లు బాగా తాగండి

చలికాలంలో నీరు తాగే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. నిజానికి చలి కాలమైనా, వేసవి కాలమైనా నీటిని తగ్గించకూడదు. పుష్కలంగా తాగాలి. మధుమేహం, ఐరన్ లోపం, విటమిన్ లోపం వంటి సమస్యల బారిన పడిన వారికి కూడా చలి ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో కూడా రక్తప్రసరణ బలహీనంగా ఉంటుంది. కాబట్టి వారికి కూడా చలి ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చలి ఎక్కువగా వేయకుండా చూసుకోవాలి.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×