Kanguva Collections: కోలీవుడ్ నుండి ఇప్పటివరకు చెప్పుకోదగిన ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా లేదు. ఎన్నో ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీ నుండి కూడా గుర్తుండిపోయే ఒక పాన్ ఇండియా సినిమా రావాలని మేకర్స్ అంతా కష్టపడుతున్నారు. ఇటీవల విడుదలయిన ‘కంగువా’పైనే అందరి ఆశలు ఉన్నాయి. కానీ అది ఇండియన్ సినీ చరిత్రలోనే అతిపెద్ద భారీ డిసాస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘కంగువా’ (Kanguva) థియేట్రికల్ రన్ పూర్తయ్యింది. మొత్తానికి ఈ మూవీకి వచ్చిన నష్టం చూస్తుంటే సూర్య ఫ్యాన్సే షాకవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ను బీట్ చేసి మరీ అత్యంత తక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ అందుకుంది.
అంచనాలు రివర్స్
‘కంగువా’తో ‘బాహుబలి 2’ బ్రేక్ చేద్దామనుకున్నారు మేకర్స్. లాభాల విషయం పక్కన పెడితే నష్టాల విషయంలో ‘రాధే శ్యామ్’తో పోటీపడ్డారు. శివ (Siva) దర్శకత్వంలో సూర్య (Suriya) ఇప్పటికే పలు యాక్షన్ కమర్షియల్ చిత్రాల్లో నటించాడు. అవన్నీ కలెక్షన్స్ పరంగా హిట్ అవ్వడమే కాకుండా తన ఫ్యాన్స్‌ను కూడా ఎంటర్‌టైన్ చేశాయి. కానీ ‘కంగువా’ విషయంలో అలా జరగలేదు. వారి అంచాలన్నీ పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని చాలానే ఖర్చుపెట్టారు మేకర్స్. దాంతో పాటు ప్రమోషన్స్ విషయంలో కూడా చాలానే కష్టపడ్డారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజా సాబ్’ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!
రూ.100 కోట్లకు పైగా నష్టం
ప్రతీ రాష్ట్రానికి తిరుగుతూ ‘కంగువా’ను విపరీతంగా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్స్ వల్ల మూవీపై హైప్ మాత్రం బాగానే క్రియేట్ అయ్యింది. కానీ థియేటర్లలో విడుదయిన మొదటిరోజే ‘కంగువా’కు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆ మూవీ థియేట్రికల్ రన్‌పై వెంటనే ఎఫెక్ట్ పడింది. రెండోరోజు నుండే ఈ సినిమాను చూడడానికి థియేటర్‌కు రావాల్సిన ప్రేక్షకులు తక్కువయిపోయారు. ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అదే పరిస్థితి ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.130 కోట్లు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ‘కంగువా’కు రూ.70 కోట్లు కలెక్షన్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.
భారీ నష్టాలు
‘కంగువా’కు దాదాపు రూ.50 కోట్లు షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ఎన్నో డిశాస్టర్ సినిమాలతో ఈ మూవీ కూడా పోటీపడింది. ‘రాధే శ్యామ్’కు రూ.120 కోట్ల నష్టాలు రాగా.. ‘కంగువా’ దానిని బీట్ చేస్తూ రూ.130 కోట్ల నష్టాలతో థియేట్రికల్ రన్ ముగించుకుంది. ఈ నష్టాల లిస్ట్‌లో మరెన్నో భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ‘ఆచార్య’ మూవీకి రూ.84.14 కోట్ల నష్టం వచ్చింది. ‘అజ్ఞాతవాసి’కి రూ.66.10 కోట్ల లాస్, ‘లైగర్’కు వచ్చిన నష్టాలు రూ.61.80 కోట్లు, ‘స్పైడర్’ మూవీ థియేట్రికల్ రన్ రూ.63.8 కోట్ల నష్టాలతో ముగిసింది. చివరిగా ప్రభాస్ నటించిన మరో సినిమా ‘సాహో’ కూడా రూ.52.15 కోట్ల నష్టంతో ఈ లిస్ట్‌లోకి యాడ్ అయ్యింది.