AP New Ration Cards: ఏపీలోని ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతికి ముందుగానే కానుక ప్రకటించింది. అది కూడా సంక్రాంతికి ముందుగానే తాము ఇచ్చే కానుక అందుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ కానుక కూడా సామాన్య కుటుంబాలకు ఒక వరమని చెప్పవచ్చు. ఆ కానుక ఏమిటంటే నూతన రేషన్ కార్డులు. అర్హులై ఉండి కార్డు లేకుండా ఎన్నో పథకాలకు దూరమవుతున్న వారికి ఇదొక సువర్ణవకాశం. అయితే నూతన రేషన్ కార్డుకు ఎలా అప్లై చేయాలి? ఎవరు అర్హులో ఒకసారి తెలుసుకుందాం.
రేషన్ కార్డు లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకం వర్తించదు. అంతెందుకు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలన్నా, మన ఆదాయ స్థితిగతులను తెలియజేసేదే రేషన్ కార్డు. అంతేకాదు ప్రతి నెలా సామాన్య కుటుంబాలకు రేషన్ కూడా ఈ కార్డు ఉంటేనే అందిస్తారు. సామాజిక పింఛన్ మంజూరు కావాలన్నా, ఇలా ఏ పథకం ద్వారానైనా లబ్దిపొందాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన సమయంలో వారి కార్డును గతంలో తొలగించారు.
అందుకు ప్రధాన కారణం వారు ఇక్కడ నివాసం లేరన్న ఆ ఒక్క కారణంతో వారిని అనర్హులుగా అధికారులు గుర్తించి జాబితా నుండి తొలగించారు. అటువంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పని పరిస్థితి. అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎందరో ఏపీలో ఉన్నారన్నది ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. అలాగే అనర్హులు కూడా కార్డును పొంది లబ్ది పొందుతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఈ నేపథ్యంలో రేషన్ కార్డులపై ప్రత్యేక విచారణ సాగించేందుకు కూడా ప్రభుత్వం సంభందిత అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈదశలో అర్హులకు అన్యాయం జరగవద్దంటూ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా సంక్రాంతి లోగా, కొత్త రేషన్ కార్డులు అందిచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. మూడవ తేదీన ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఈ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం సైతం ఉంది. కాగా ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించి, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులను కేవలం ప్రభుత్వ ముద్ర వేసి అర్హులకు అందించనున్నారు.
Also Read: Botsa on Pawan Kalyan: హమ్మయ్య.. పవన్ నా కోరిక తీర్చారు.. మాజీ మంత్రి బొత్స ఆనందం
కొత్తగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకొనే వారు ఆధార్ కలిగి ఉండి, సంబంధించిన దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. అనంతరం తమ దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తును సమర్పిస్తే, రెవిన్యూ అధికారులు ఆ దరఖాస్తును స్వీకరించి, విచారణ కొనసాగిస్తారు. దరఖాస్తుదారుడు అర్హులైతే, సంక్రాంతి లోగా వారికి రేషన్ కార్డును అధికారులు అందిస్తారు. ఇంకా రేషన్ కార్డుకు సంబంధించి మార్గదర్శకాలు పూర్తిగా వెల్లడి కావాల్సి ఉండగా, కేబినెట్ భేటీ అనంతరం దీనిపై ఓ క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఆధార్ లో వివరాలు, ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం, ఇలా వివరాలను సరిచూసుకుంటే మంచింది. మొత్తం మీద అర్హులందరికీ ప్రభుత్వం నూతన రేషన్ కార్డును తప్పక అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకు రానుంది.