BigTV English

Clothing Label: మీరు కొన్న కొత్త దుస్తుల లేబుల్ పై త్రిభుజం గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా?

Clothing Label: మీరు కొన్న కొత్త దుస్తుల లేబుల్ పై త్రిభుజం గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా?

Clothing Label: కొత్త దుస్తులు కొన్నప్పుడు దానికి ఉండే లేబుల్‌ను పరిశీలించండి. వాటిపై ఆ దుస్తుల గురించి వివరాలు ఉంటాయి. ఆ వివరాలతో పాటు ఒక త్రిభుజం గుర్తు కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? అలా లేబుల్ పై త్రిభుజం గుర్తుతో పాటూ మరికొన్ని గుర్తులు ఎందుకు ఉంటాయో. అసలు ఆ చిహ్నాలకు అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారా?


ఏదైనా కొత్త డ్రెస్ కొన్నప్పుడు దానికి ఉండే లేబుల్ పై ఒక ఐదు చిహ్నాలు ఉండే అవకాశం ఉంది. ఆ చిహ్నాలు ఆ దుస్తులను ఎలా ఉతకాలో, ఎలా జాగ్రత్తగా వాడాలో చెప్పేవి. అన్ని లేబుల్ పై త్రిభుజం ఆకారం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఆ త్రిభుజం ఆకారం నాలుగు రకాలుగా ఉండవచ్చు. వాటికి అర్థాలు తెలుసుకోండి.

త్రిభుజానికి అర్థం
కొన్ని దుస్తులపై త్రిభుజం మాత్రమే వేసి ఉంటుంది. దానిపై ఎలాంటి గీతలు ఉండవు. ఈ ఖాళీ త్రిభుజం ఆ దుస్తులను బ్లీచ్ తో ఉతకవచ్చు అని చెబుతుంది. ఇక త్రిభుజంలో మరొక త్రిభుజం ఉన్నట్టు ఉన్న చిహ్నం ఆ దుస్తులను బ్లీచ్ చేయకూడదని చెబుతుంది. ఇక త్రిభుజంలో క్రాస్ గుర్తు ఉన్నా లేదా CL అని ఆంగ్లంలో రాసి ఉన్నా… క్లోరీన్ లేదా బ్లీచ్ ని ఆ దుస్తులు ఉతికేందుకు ఉపయోగించాలని సూచించేది.


దుస్తులను ఎలా ఉతికితే అవి పాడవకుండా ఉంటాయో చెప్పేందుకే లేబుల్ పై ఇలాంటి చిహ్నాలను ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే వాషింగ్ మిషన్ లో లేదా బకెట్లో బట్టలు వేసి ఉతుకుతున్నప్పుడు అన్నిటినీ కలిపి బ్లీచ్ పెట్టి ఉతికేసేవారు ఎక్కువమంది ఉన్నారు. కొన్ని దుస్తులు బ్లీచ్ వల్ల పాడవుతాయి. మరికొన్నింటికి బ్లీచ్ పెట్టకపోవడం వల్ల మురికి వదలకుండా ఉంటుంది. కాబట్టి మీరు కొన్న దుస్తులు ఎలా ఉతకాలో ఆ లేబుల్ బట్టి అర్థం చేసుకోండి.

కొన్ని దుస్తులపై బకెట్ ఆకారంలో ఉండి ఆ బకెట్లో 40 లేదా 30 వంటి అంకెలు వేసి ఉంటాయి. అంటే ఆ బట్టలను 30 డిగ్రీలు లేదా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీటితో ఉతకవచ్చని అర్థం. అంతకుమించి ఎక్కువ వేడి నీళ్లు వేస్తే ఆ బట్టలు చిరిగిపోయే అవకాశం ఉంటుందని చెప్పడమే. కొన్ని లేబుళ్ల పై ఆరు చుక్కలు పెట్టి ఉంటాయి. ఆరు చుక్కలకు అర్థం 95 డిగ్రీల వరకు ఆ దుస్తులు వేడిని తట్టుకుంటాయని చెప్పడమే

ఇస్త్రీ పెట్టే చిహ్నం
కొత్త దుస్తుల లేబుళ్ల పై ఇస్త్రీ చేసే చిహ్నం కూడా ఉంటుంది. ఇస్త్రీ పెట్టె చిహ్నం ఉంటే మీరు ఆ దుస్తులను ఐరన్ చేయవచ్చని అర్థం. అలా కాకుండా ఇస్త్రీ పెట్టే ఆకారంపై క్రాస్ గుర్తు ఉంటే మీరు దాన్ని ఐరన్ చేయకూడదని తెలుసుకోవాలి. అలాగే ఎంత ఉష్ణోగ్రత వరకు ఐరన్ చేయవచ్చో కూడా అక్కడ నంబర్లు ఇస్తూ ఉంటారు. ఈ ఐరన్ బాక్స్ చిహ్నం లోపల ఒక చుక్క ఉంటే దానికి అర్థం తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆ దుస్తులను ఇస్త్రీ చేయాలని అర్థం.

కొన్ని దుస్తులను డ్రై క్లీనింగ్ కు కూడా ఇస్తూ ఉంటారు. మీరు కొన్న చీర లేదా షర్ట్ అనేది డ్రై క్లీన్ చేయొచ్చో లేదో కూడా ఆ లేబుల్ పై ఉంటుంది. సర్కిల్ గీసి ఉంటే ఆ దుస్తులను కేవలం మాత్రమే చేయాలని అర్థం. సర్కిల్ కింద కుడివైపున ఒక చిన్న గీత ఉంటే… తక్కువ ఉష్ణోగ్రత వద్ద డ్రై క్లీనింగ్ చేయాలని చెప్పడమే. అదే సర్కిల్ పై క్రాస్ గుర్తు ఉంటే డ్రై క్లీనింగ్ చేయకూడదని అర్థం చేసుకోవాలి.

Also Read: భ‌ర్త‌కు భార్య చెప్ప‌కూడ‌ని 5 విష‌యాలు.. ఇవి చెబితే అంతే సంగ‌తి!

నిజానికి సాధారణ ప్రజలకు ఇలా క్లాతింగ్ లేబుల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ కంపెనీల వారు మాత్రం కచ్చితంగా ఇలా లేబుల్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే అవి మార్కెట్లోకి వస్తాయి.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×