BigTV English

Sharmila on Sri Reddy: శ్రీరెడ్డి.. నీ సారి? పోలీసులూ వదలొద్దు.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైఎస్ షర్మిళ

Sharmila on Sri Reddy: శ్రీరెడ్డి.. నీ సారి? పోలీసులూ వదలొద్దు.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైఎస్ షర్మిళ

Sharmila on Sri Reddy: సారీలు చెప్పినంత మాత్రాన, తిట్టిన బూతులు చెరిగిపోతాయా.. క్షమాపణలు అడిగినా క్షమించేది లేదంటూ వైఎస్ షర్మిళ సీరియస్ అయ్యారు. పరోక్షంగా తన కోపాన్ని శ్రీరెడ్డి పై షర్మిళ వ్యక్తం చేశారని భావించవచ్చు.


ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రోలింగ్ చేసిన బ్యాచ్ భరతం పడుతున్నారు పోలీసులు. వైసీపీకి చెందిన కొందరు హద్దులు దాటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధానంగా కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసింది. రవీంద్రారెడ్డి అరెస్టుపై స్వయంగా వైఎస్ షర్మిళ కూడా స్పందించి హర్షం వ్యక్తం చేశారు. తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో శ్రీరెడ్డి రెండు దఫాలుగా సారీల పర్వం సాగించారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి.. నోటికి వచ్చిన మాటలతో రెచ్చిపోయారు. అయితే ఈ అరెస్టుల పర్వం సాగుతుండగా.. శ్రీరెడ్డి మొన్న సారీ సారీ అంటూ.. వీడియో విడుదల చేశారు. ఈ వీడియో విడుదల అనంతరం టీడీపీ నేతలు మరికాస్త స్పీడ్ పెంచి, శ్రీరెడ్డి పై ఫిర్యాదుల పరంపర సాగిస్తున్నారు. మళ్ళీ ఆందోళన చెందిన ఆమె ఈసారి ఏకంగా ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో అందరికీ సారీ అంటూనే, ఈసారి వైసీపీ కి గుడ్ బై చెప్పేశారు. తనను పార్టీ కార్యకర్తగా గుర్తించలేదని కూడా ఆవేదన చెందారు.


గతంలో షర్మిళను ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి తీవ్ర కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కూడా హద్దులు దాటి చేసినట్లు అప్పుడు వైఎస్సార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా శ్రీరెడ్డి సారీ చెబుతున్న క్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ షర్మిళ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించిన ఎవరినీ వదిలిపెట్టకుండా అరెస్ట్ చేయాలన్నారు. సారీ లు చెబితే సరిపోతుందా.. బూతులు తిట్టడం.. మళ్లీ సారీ అనడం ఇదేమి ఫ్యాషన్ కాదన్నారు.

Also Read: Sri Reddy: వైసీపీకి గుడ్ బై చెప్పిన శ్రీరెడ్డి.. లేఖ విడుదల.. సారీల పర్వంలో ఈసారి కొత్త పేర్లు.. వారెవరంటే?

ఈ ఇష్యూను పొలిటికల్ గా ఆలోచించకుండా పోలీసులు సోషల్ ఇష్యూగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. సైకోలను అరెస్టులు చేస్తున్నందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు కేసు పెట్టాలని ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నందున పార్టీ రంగు పులమకూడదని దూరంగా ఉన్నట్లు తెలిపారు. షర్మిళ చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసినట్లుగా పొలిటికల్ టాక్. ఎందుకంటే ఇటీవల సారీ.. సారీ అంటున్నది శ్రీరెడ్డి కాబట్టి. మరి షర్మిళ చేసిన కామెంట్స్ పై శ్రీరెడ్డి సైలెంట్ గా ఉంటారా.. లేక మళ్లీ షర్మిళ కోసం ప్రత్యేక లేఖ విడుదల చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×