సంతోషంగా ఉన్నవారు నిద్రా, విచారంగా ఉన్న వారి నిద్రా భిన్నంగా ఉంటాయని కొత్త అధ్యయనం చెబుతుంది. ఒకరు నిద్రపోయే విధానాన్ని బట్టి వారు ఎలా ఉన్నారో వివరించవచ్చని అంటోంది ఈ అధ్యయనం.
మనిషికి నిద్ర ఎంతో ముఖ్యం. బాధలో ఉన్న వారైనా, సంతోషంలో ఉన్న వారైనా నిద్ర పోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే వారు మరుసటి రోజు పనులు చేయగలుగుతారు. అయితే ఒక అధ్యయనం ప్రకారం సంతోషంగా ఉన్నవారు తక్కువ నిద్రపోతారని. విచారంగా ఉన్న వారు ఎక్కువ నిద్రపోతారని తేల్చింది. ఇది కొంచెం ఆశ్చర్యపరిచే అంశమే అయినా దీన్ని శాస్త్రీయంగా నిర్ధారించింది కొత్త పరిశోధన.
సంతోషంగా ఉన్నవారికి ఎక్కువ నిద్ర పడుతుందని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి కష్టాలు ఉండవు. ఆలోచనలు ఉండవు. అందుకే వారికి ఇట్టే నిద్రపట్టేస్తుందని ఎక్కువ కాలం నిద్రపోతారని అనుకుంటారు. నిజానికి సంతోషంగా ఉన్నవారే తక్కువగా నిద్రపోతారు. అలాగే ఉత్సాహంగా కూడా ఉంటారు. ఇక విచారంగా ఉన్నప్పుడు వారికి మంచం మీద నుండి లేవాలని అనిపించదు. నిద్ర పట్టినా, పట్టకపోయినా అలా ఉండడానికే ఇష్టపడతారు. ఎక్కువ నిద్రపోవాలని కోరుకుంటారు. ఈ విషయాలన్నీ అధ్యయనం వెల్లడించింది. మన మెదడు నిద్రా అవసరాలు నియంత్రించుకోవడంలో భావోద్వేగాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ద్వారా చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రా నాణ్యత, నిద్రా సమయం అనేవి మానసిక ఆరోగ్యంతో లోతుగా ముడిపడి ఉంటాయి. సంతోషంగా ఉన్నవారు ఎక్కువ చురుకైన మనసును కలిగి ఉంటారు. ఇక తక్కువ నిద్రపోవడం వంటివి చేస్తారు. అయినా కూడా వారు శక్తివంతంగా ఉంటారు. ఇక అసంతృప్తిగా, నిరాశలో ఉన్న వ్యక్తి మాత్రం ఎక్కువ విశ్రాంతి అవసరమని కోరుకుంటాడు. అందుకే నిద్ర పోవాలనే కోరిక ఆయనలో ఎక్కువగా ఉంటుంది.
నిద్ర తగ్గినా సమస్య రాదు
సంతోషంగా ఉన్నప్పుడు మన శరీరం ఎక్కువ డోపమైన్, సెరిటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి మనల్ని శక్తివంతం చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో నిద్ర తక్కువైనా కూడా అలసిపోయినట్టు అనిపించదు. ఇక విచారంగా ఉన్నవారిలో శరీరం కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని కారణంగా మనకు ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తుంది.
సంతోషకరమైన మనసుతో ఉన్నవాళ్లు తక్కువ సమయం నిద్రపోయినా కూడా చాలా గాఢ నిద్రను కలిగి ఉంటారు. ఆ గాఢనిద్ర వారి శరీరానికి సరిపోతుంది. ఇక విచారంగా ఉన్నవారికి మెదడు అలసిపోయి ఉంటుంది. వారికి ఎక్కువ విశ్రాంతి అవసరం కాబట్టి నిద్ర గంటలు కూడా పెరుగుతాయి. వారు నీరసంగా శక్తి లేనట్టు ఉంటారు. దీని వల్ల కూడా శరీరం అలసిపోయినట్టు అనిపించి ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడతారు. నిద్ర అనేది మనసుకు విశ్రాంతి ఇచ్చే ఒక మార్గం.
Also Read: ఈ సూపర్ ఫుడ్స్‌తో తెల్ల జుట్టు మాయం !