Snoring Effects: నిద్రపోతున్నప్పుడు గురక రావడం సహజం. కానీ రోజూ గురక పెడుతూ, శ్వాస కోసం ముక్కును గట్టిగా ఊదుతూ ఉంటే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బిగ్గరగా, నిరంతరాయంగా గురక పెట్టడం ఆరోగ్యంగా లేకపోవడానికి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. గురక పెట్టేవారికి పూర్తిగా నిద్ర పట్టదని అంటున్నారు. గురక కారణంగా, ప్రతి నాల్గవ వ్యక్తి స్లీప్ అప్నియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మన దేశంలో 12 కోట్ల మందికి పైగా ప్రజలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. గురక కారణంగా, హైపర్ టెన్షన్-షుగర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో దీనికి చికిత్స తీసుకోకపోతే, అది ప్రాణాంతక వ్యాధికి కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గురక రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని కూడా సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గురక దుష్ప్రభావాలు
స్లీప్ అప్నియా
షుగర్, బీపీ అసమతుల్యత
కొలెస్ట్రాల్ పెరుగుదల
బ్రెయిన్ స్ట్రోక్
గురక ఈ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది:
హైపర్‌టెన్షన్:
రాత్రిపూట ఎక్కువసేపు గురక పెట్టే వారికి హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య 83% మంది పురుషులు మరియు 71% మంది స్త్రీలలో సర్వసాధారణం.
Also Read: టీని ఎక్కువ సేపు మరిగిస్తున్నారా..? ఏం అవుతుందో తెలుసా
గుండెపోటు:
తేలికపాటి లేదా అప్పుడప్పుడు వచ్చే గురక సాధారణమే. అయినప్పటికీ, దీర్ఘకాలికంగా వచ్చే గురక కారణంగా స్ట్రోక్, గుండెపోటు వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.
బ్రెయిన్ స్ట్రోక్:
నిద్ర లేకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో ముందుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు మొదలవుతాయి. ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది. చివరకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.
ఈ వ్యక్తులు ఎక్కువగా గురక పెడతారు:
అధిక బరువు ఉన్నవారు: అధిక బరువు ఉన్నవారు గురకతో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు.
టాన్సిల్స్‌తో బాధపడుతున్న పిల్లలు: టాన్సిల్స్‌తో బాధపడే పిల్లల్లో గురక సమస్య కూడా ఉండవచ్చు.
సైనస్ పేషెంట్లు: సైనస్ రోగులకు కూడా గురకతో ఎక్కువ సమస్యలు ఉంటాయి.
Also Read: ఆస్తమాలో 4 దశలు.. ఇందులో ఏది అత్యంత ప్రాణాంతకమో తెలుసా?
గురకను ఎలా నియంత్రించాలి..?
బరువు తగ్గండం:
అధిక బరువుతో ఉన్న వారు ఖచ్చితంగా బరువు తగ్గాలి. బరువు తగ్గడం వల్ల ఈ సమస్య ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
వర్క్ అవుట్:
వ్యాయామం చేయడం వల్ల గురక తగ్గుతుంది. నోరు, గొంతు వ్యాయామాలు, ఒరోఫారింజియల్ కండరాల వ్యాయామాలు అని పిలుస్తారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాను మెరుగుపరుస్తుంది, గురకను తగ్గిస్తుంది. ఈ వ్యాయామాలు నాలుక కండరాలను బలోపేతం చేస్తాయి.
మెడ వ్యాయామాలు చేయండి:
మెడ, గొంతు, నాలుక లేదా నోటిలోని కండరాలు అడ్డంకిని కలిగించి గురకను పెంచుతాయి. ఈ వ్యాయామం ఈ కండరాలను టోన్ చేస్తుంది. గురక సమస్యను తగ్గిస్తుంది.