Big Stories

Over Boiling Tea Side Effects: టేస్ట్ కోసం టీని ఎక్కువ సేపు మరిగిస్తున్నారా..? ఏం అవుతుందో తెలుసా?

Side Effects of Over boiling Tea: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితంలో టీ చాలా ముఖ్యమైన అలవాటు అని చెప్పాలి. 100లో దాదాపు 80 శాతం మందికి ప్రతీ రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ప్రతీ రోజూ వారు ఎదుర్కొంటున్న పరిస్థితిల కారణంగా రోజూ టీని తాగడానికి ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అందులో కూడా స్ట్రాంగ్ టీని ఎక్కువసేపు ఉడకబెట్టి తాగేవారు ఉంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు మరిగించి టీ తాగడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. టీని ఎక్కువసేపు ఉడకబెట్టడం ఆరోగ్యానికి హానికరం. టీని ఎక్కువ సేపు మరిగించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు టీని ఎంతసేపు ఉడకబెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

అతిగా ఉడికించిన టీ ఆరోగ్యానికి హానికరం

- Advertisement -

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీని ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల విషపూరితం అవుతుంది. దీని కారణంగా అసిడిటీ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అతిగా ఉడికించిన టీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వేసవిలో ఇలాంటి టీ తాగితే కడుపునొప్పి, మలబద్ధకం, అసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలు రావచ్చు. ఉడికించిన టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు లేదా దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. చాలా బలమైన టీ తాగడం వల్ల రక్తహీనత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీని ఎంతసేపు మరగబెట్టాలి..?

టీని తయారుచేసేటప్పుడు ఒక టీస్పూన్ టీ పొడి మాత్రమే వాడాలి. నీటిలో లేదా పాలలో టీ పొడిని కలిపినప్పుడు, కనీసం రెండు నిమిషాలు పూర్తిగా ఉడకనివ్వాలి. దీని తరువాత, టీ రంగు మారగానే, అందులో దాల్చిన చెక్క, లవంగాలను వేసి రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి వాసనను కూడా ఇస్తుంది. అయితే టీని రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉడకబెట్టకూడదు. ఇలా చేయడం వల్ల అది విషపూరితంగా మారుతుంది. ఎక్కువ సేపు మరిగించిన టీని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

టీ తయారుచేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

టీ పొడి లేదా ఆకులను గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచాలి. దీంతో, టీ ఆకుల రుచి చాలా కాలం పాటు ఉంటుంది. టీ తయారు చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, టీ ఆకులను నీటిలో సరిగ్గా ఉడకబెట్టి, తరువాత మాత్రమే పాలు కలపడం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News