Best EV Deals Before Diwali 2026: ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి దీపావళి వేళ అదిరిపోయే ఆఫర్లు లభిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ EVలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. కొన్ని మోడళ్లపై రూ.3 లక్షలకు పైగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా, ఎంజీ, కియా, హ్యుందాయ్ కంపెనీలకు చెందిన ఏ ఎలక్ట్రిక్ కార్లపై ఎంత ఆఫర్ ఉందో చూద్దాం.
టాటా కర్వ్ EVపై అత్యధికంగా రూ.3.35 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.3 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ.35 వేల వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ ఉంది. ఈ కారు ధర రూ.17.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 45kWh, 55kWh బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది.
టాటా హారియర్ EVపై రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. దీని ధర రూ.21.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ ఆప్షన్లను బట్టి 538 నుంచి 627 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఎంజీ ZS EVపై కూడా రూ.2.7 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఛార్జర్ కూడా లభిస్తుంది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాటా టియాగో EV పాత స్టాక్‌పై రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. దీని ధర రూ.7.99 లక్షల నుంచి ఉంది. ఇక టాటా పంచ్ EV పాత మోడల్‌పై కూడా రూ.1.45 లక్షల వరకు తగ్గింపు ఉంది. అయితే, ఈ ఆఫర్లు అప్‌డేట్ చేసిన 40kWh వెర్షన్‌కు వర్తించవు.
కియా కేరెన్స్ క్లావిస్ EVపై రూ.75 వేల వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ, స్క్రాపేజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై రూ.65 వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. టాటా నెక్సాన్ EVపై రూ.45 వేల వరకు, కియా సైరోస్ EVపై రూ.20 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
ఈ ఆఫర్లు మోడల్, వేరియంట్, పాత స్టాక్ లభ్యతను బట్టి మారుతాయి. అన్ని బెనిఫిట్స్ ప్రతి కొనుగోలుదారుడికి ఒకేసారి వర్తించకపోవచ్చు. సో, కారు బుక్ చేసే ముందు సమీప డీలర్‌షిప్‌లో ఆఫర్ల వివరాలు, కండీషన్స్ తెలుసుకోవడం మంచిది. సరైన డీల్ ఎంచుకుంటే దీపావళికి ముందు ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై మంచి మొత్తాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?