E-Paper
Advertisement

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!
Advertisement

Lalit Modi On Team India Cricketers:  ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ (Lalit Modi) గురించి తెలియని వారు ఉండరు. దేశాన్ని వదిలి పారిపోయిన ఆయన ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. లేటెస్ట్ గా టీమిండియా క్రికెటర్లపై హాట్ కామెంట్స్ చేశాడు. భారతదేశాన్ని వదిలి ఇతర దేశాల్లో అడుగుపెడితే, మ‌న‌ క్రికెటర్లకు ఎలాంటి వ్యాల్యూ ఉండదని వెల్లడించాడు. బయటి దేశంలో కుక్క కూడా పట్టించుకోదంటూ బాంబు పేల్చాడు. మన దేశంలోనే క్రికెట్ ను బాగా ఆదరిస్తారని వ్యాఖ్యానించాడు. అంతే కాదు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో క్రికెటర్లను పట్టించుకునే నాధుడే లేడని స్పష్టం చేశాడు. కానీ మన దేశంలో క్రికెటర్ ను దేవుడు లాగా భావించే సంస్కృతి ఉందని… దానివల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ స‌క్సెస్ అయింద‌ని తెలిపాడు.

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు

భారతదేశంలో క్రికెట్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ వెల్లడించాడు. ఈ విషయాన్ని ముందే గ్రహించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను 2008 సమయంలో తీసుకు వచ్చినట్టు వివరించాడు. ఐపీఎల్ టోర్నమెంట్ అంటే అప్పట్లో హేళన చేస్తూ మాట్లాడారని తెలిపాడు. కానీ ఇప్పుడు అదే టోర్నమెంట్ కోసం విదేశీ క్రికెటర్లు పోటీ పడుతున్నారని గుర్తు చేశాడు. ఇండియాలో విపరీతంగా క్రికెట్ చూస్తారన్న కాన్సెప్ట్ తో రూపొందించింది ఈ ఐపీఎల్ అని తెలిపాడు. అందుకే ఐపీఎల్ ద్వారా కోట్ల వర్షం కురుస్తోందని వివరించాడు. అయితే ఇతర దేశాలలో మాత్రం క్రికెట్ గురించి పట్టించుకునే వాడే ఉండడని పేర్కొన్నాడు. ఇండియాలో ఒక్క సెంచరీ చేస్తే క్రికెటర్ సూపర్ స్టార్ అవుతాడని స్పష్టం చేశాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

అతడు రెగ్యులర్ గా బాగా ఆడితే దేవుడు లాగా పూజించే వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నారని ల‌లిత్ మోడీ తెలిపాడు. అదే ప్లేయర్ అట్టర్ ఫ్లాప్ అవుతూ దిగజారితే… భారతీయులు కూడా అతన్ని ద్వేషించడం మొదలు పెడతారని వివరించాడు. హీరోను కాస్త విలన్ చేసి ఆడుకుంటారని తెలిపాడు. కానీ విదేశాలలో మాత్రం ఇలాంటి సంస్కృతి ఉండదన్నాడు. ఇండియా దాటి విదేశాల్లో అడుగుపెడితే క్రికెటర్లకు వ్యాల్యూ ఉండదని.. ఎవరు గుర్తు కూడా పట్టలేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ కు ఇండియాలో కూడా అభిమానులు ఉన్నారు… అతని ఆట కోసం ఇంగ్లాండు మ్యాచ్ చూసే భారతీయులు కూడా ఉన్నారని వివరించాడు. కానీ అతడు అంటే ఇంగ్లాండ్ లోనే కాదు వెస్టిండీస్ లో కూడా ఎవరికి తెలియదని పరువు తీశాడు. విదేశాల్లో క్రికెటర్లకు క్రేజ్ ఉండదని.. వాళ్లు ఎక్కువగా ఫుట్ బాల్ చూస్తారని తెలిపాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో హార్దిక్ పాండ్యా ఊచకోత…రూ.94.91 ల‌క్ష‌ల ప్రైజ్ మనీ

అల్లా మీద ఒట్టు… 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా షాహీన్ అఫ్రిది అందుకుంటాడు

ట్రై సిరీస్ గెలిచిన పాక్…టీమిండియాకు ఇంజమామ్ వార్నింగ్

పొట్టోడా అంటూ బ‌వుమాను ట్రోల్ చేశారు..ఇప్పుడు వాడే తొక్కితే ఆస్ట్రేలియా ప్లేయర్లు పాతళంలో పడ్డారు

గ‌ల్లీ క్రికెట్ పై ట్వీట్ చేస్తావా? కొంచెమైనా సిగ్గుండాలి..పాక్ ప్ర‌ధాని ష‌రీఫ్ పై అకాశ్ చోప్రా సీరియ‌స్‌

చిచ్చు పెట్టిన అబ్రార్ అహ్మ‌ద్..గిల్ న‌న్ను మోసం చేశాడంటూ లేడీ ర‌చ్చ !

నీ ఇంగ్లీష్‌కు దండం రా నాయ‌నా… ఇఫ్తికార్ అహ్మద్ పై దారుణంగా ట్రోల్స్

Big Stories

Advertisement
×