E-Paper
Advertisement

డిప్రెషన్, ఆందోళనకు దూరంగా ఉండాలా? బామ్మల కాలం నాటి ఈ 6 హాబీలు మళ్లీ పాటించండి

డిప్రెషన్, ఆందోళనకు దూరంగా ఉండాలా? బామ్మల కాలం నాటి ఈ 6 హాబీలు మళ్లీ పాటించండి
Advertisement

Traditional Hobbies to reduce stress| ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత కరువైందా? ఆఫీసు పని ఒత్తిడి, మొబైల్ ఫోన్ వాడకం, వ్యక్తిగత సమస్యలు మనసును అలసిపోయేలా చేస్తున్నాయా? చిన్న చిన్న విషయాలకే చిరాకు, ఆందోళన, నిరాశ కలుగుతున్నాయా? అయితే ఖరీదైన గాడ్జెట్లు, వినోదాలే అవసరం లేదు. మన బామ్మలు, తాతయ్యలు పాటించిన కొన్ని పాత అలవాట్లు కూడా మనసుకు ఉపశమనం కలిగిస్తాయి.

1. మనసుకు ప్రశాంతత కోసం తోటపని

మొక్కలు పెంచడం, వాటికి నీళ్లు పోయడం, కొత్త చిగుళ్లను చూడటం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రకృతితో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మొక్కలు పెంచడం సహనాన్ని కూడా నేర్పుతుంది. గతంలో చాలామంది ఇళ్లలో కిచెన్ గార్డెన్లు ఉండేవి. ఇప్పుడు బాల్కనీల్లో, ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది.

2. ఏకాగ్రతను పెంచేందుకు అల్లికలు, కుట్టుపని

Advertisement

బామ్మల కాలంలో అల్లికలు, కుట్టుపని, క్రోషియా వంటి పనులకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఈ పనులు చేసేటప్పుడు మనసంతా వాటిపైనే కేంద్రీకృతమవుతుంది. దీంతో ఇతర ఆలోచనల నుంచి కొంతసేపు దృష్టి మళ్లుతుంది. కొత్త వస్తువులు తయారు చేయడం వల్ల సంతృప్తి, సంతోషం కలుగుతుంది.

3. ఒంటరితనాన్ని తగ్గించేందుకు కథలు చెప్పడం

గతంలో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు సాయంత్రం వేళల్లో ఒకచోట చేరేవారు. చిన్ననాటి జ్ఞాపకాలు, సరదా సంఘటనలు, కథలు పంచుకునేవారు. ఇలాంటి సంభాషణలు మనసులోని భావాలను పంచుకోవడానికి సహాయపడతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం వల్ల ఒంటరితనం తగ్గుతుంది.

4. సంప్రదాయ వంటలు చేయడం

Advertisement

ఊరగాయలు పెట్టడం, అప్పడాలు చేయడం, మసాలాలు దంచడం వంటి పనులు బామ్మలకు ఎంతో ఇష్టమైన హాబీలు. ఈ పనులు ఓపికతో, శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ప్రతి పనిపై దృష్టి పెట్టడం వల్ల ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ వంటలు తయారు చేయడం మరింత ఆనందాన్నిస్తుంది.

5. మనసును ఉత్సాహపరిచే జానపద పాటలు, భజనలు 

గతంలో మహిళలు, పెద్దలు కలిసి జానపద పాటలు, భజనలు పాడుకునేవారు. సంగీతం వినడం, పాటలు పాడటం మనసుకు ఆనందంగా ఉంటుంది. ఇష్టమైన పాటలు వినడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పాటలు పాడటం మంచి అలవాటు.

Also Read: ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు..ఈ తేదీల్లో పుట్టినవారికి కుతూహలం ఎక్కువ

6. మట్టి వస్తువులు తయారు చేయడం

మట్టితో కుండలు, ఇతర వస్తువులు తయారు చేయడం మంచి సృజనాత్మక హాబీ. చేతులతో మట్టికి ఆకారం ఇవ్వడం ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ప్రక్రియలో ఓపిక, శ్రద్ధ అవసరం. మనం తయారు చేసిన వస్తువును చూసినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి కలుగుతుంది.

Also Read: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే మీ జీవితం నాశనమే.. ప్రశాంతంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి

చిన్న అలవాట్లతో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి

బామ్మల కాలం నాటి ఈ హాబీలు నేటి బిజీ జీవితంలోనూ ఉపయోగపడతాయి. వీటిని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

Related News

కోపంలో నోరుజారి మీ పార్ట్‌నర్‌తో ఈ 4 మాటలు అన్నారో.. మీ ప్రేమ కథ అక్కడితో క్లోజ్!

సెలబ్రిటీలు చెప్పే 3 లీటర్ల నీళ్ల సూత్రం నిజంగా పనిచేస్తుందా? మీరు కూడా ఇలాగే చేస్తున్నారా?

పిల్లల్లోనూ గుండె జబ్బుల ముప్పు.. 10 ఏళ్ల వయసులోనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాలి

దీపావళికి స్వీట్స్ తింటూనే ఆరోగ్యం కాపాడుకోవాలా? ఈ 5 హెల్తీ లడ్డూలు ట్రై చేయండి!

90 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవిస్తున్న జపాన్ ప్రజలు.. కారణాలివే

కోపం వస్తే దాన్ని అణుచుకోకూడదు.. మన:శాంతి కోసం ఓషో చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి

ప్రెగ్నెన్సీ తొమ్మిదో నెలలో వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న సమంత.. ఆ సమయంలో చేయడం తల్లి, బిడ్డకు మంచిదేనా?

Big Stories

Advertisement
×