Relationship Tips: ప్రేమలో చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఎంత ప్రేమగా ఉన్నా.. కొన్నిసార్లు కోపంలో మాటలు తడబడతాయి. అవతలి వ్యక్తిని బాధపెట్టాలని అనుకోకపోయినా, ఆవేశంలో అనే కొన్ని మాటలు మనసుకు గట్టిగా తగులుతాయి. ఆ తర్వాత క్షమాపణ చెప్పినా, ఆ బాధ అంత త్వరగా పోదు. అందుకే బంధంలో ఏం మాట్లాడాలో తెలుసుకోవడంతో పాటు, ఏ మాటలు మాట్లాడకూడదో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ముఖ్యంగా పార్ట్‌నర్‌తో గొడవ పడినప్పుడు ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఎంత పెద్ద గొడవ జరిగినా.. ‘నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలోనే పెద్ద తప్పు’ లేదా ‘నిన్ను ప్రేమించడమే నా తప్పు’ అని అనకండి. ఇలాంటి మాటలు మీ పార్ట్‌నర్‌ను లోతుగా బాధపెడతాయి. కోపం తగ్గిన తర్వాత మీరు మామూలుగా ఉన్నా.. ఆ మాటలు మాత్రం వారి మనసులో ఉండిపోవచ్చు. సమస్య ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడండి. అంతేకానీ, మీ బంధాన్నే తప్పు పట్టకండి.
మీ పార్ట్‌నర్ సంపాదన తక్కువగా ఉందని, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎగతాళి చేయకండి. గొడవల సమయంలో ఇలాంటి విషయాలను ప్రస్తావించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక పరిస్థితులు మారుతుంటాయి. డబ్బు విషయంలో సమస్యలుంటే ఇద్దరూ కలిసి పరిష్కారం వెతకాలి. ఒకరినొకరు కించపరచడం వల్ల బంధంలో దూరం పెరుగుతుంది.
Also Read: సెలబ్రిటీలు చెప్పే 3 లీటర్ల నీళ్ల సూత్రం నిజంగా పనిచేస్తుందా? మీరు కూడా ఇలాగే చేస్తున్నారా?
మీ పార్ట్‌నర్ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీకు నచ్చకపోవచ్చు. అయినా, వారిని తిట్టడం, ఎగతాళి చేయడం సరైన పద్ధతి కాదు. మీ పార్ట్‌నర్ తన కుటుంబం గురించి మీతో ఫిర్యాదు చేసినా, మీరు కూడా అదే విషయాన్ని పట్టుకుని అవమానించకండి. ఏదైనా సమస్య ఉంటే ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోండి.
మీ పార్ట్‌నర్ తన భయాలు, బలహీనతలు, అభద్రతల గురించి మీతో చెప్పారంటే.. మిమ్మల్ని నమ్ముతున్నారని అర్థం. అలాంటి విషయాలను గొడవల సమయంలో బయటపెట్టి ఎగతాళి చేయడం ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా వారి రూపం, బరువు లేదా వ్యక్తిగత సమస్యలపై జోకులు వేయకండి. ప్రేమ అంటే ఒకరి బలహీనతలను మరొకరు ఎగతాళి చేయడం కాదు. వాటిని అర్థం చేసుకుని, కష్ట సమయంలో అండగా నిలబడటమే నిజమైన ప్రేమ.
Also Read: దీపావళికి స్వీట్స్ తింటూనే ఆరోగ్యం కాపాడుకోవాలా? ఈ 5 హెల్తీ లడ్డూలు ట్రై చేయండి!